కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈనెల 8న సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ వేశారు. తాజాగా విచారణ జరిగింది. కేటీఆర్ తరఫున సీనియర్ కౌన్సిల్ సుందరం వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున ముఖుల్ రోహిత్గి హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. పిటిషన్‌ను విత్ డ్రా చేసుకుంటామని కేటీఆర్ తరపు న్యాయవాది తెలిపారు. “విచారణ ప్రాథమిక దశలోనే ఉంది.. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేం.. ప్రత్యామ్నాయ మార్గాలు మీకు ఉన్నాయి కదా..” అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
READ MORE: PM Modi: యుద్ధనౌకలు, జలాంతర్గామినీ జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ
దీంతో కేటీఆర్ తరఫు న్యాయవాది క్వాష్ పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించే ముందు, తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కేసులో ముందుగానే స్పందించింది. ఏసీబీ కేసుపై ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసి, హైకోర్టు తీర్పుపై కేటీఆర్ పిటిషన్ వేస్తే తమ వాదనలూ వినాలని కోరింది. కేటీఆర్ పిటిషన్‌కు సంబంధించిన విచారణ , ప్రభుత్వ వాదనలు రేపు సుప్రీంకోర్టులో కీలకంగా ఉండనున్నాయి.
READ MORE: Kapil Dev: ఏంటి భయ్యా.. ఆయనను కపిల్ దేవ్ అంత మాట అనేశాడు