KTR : పల్లే కన్నీరు పెడుతుందోయ్ అనే పాట ప్రభుత్వాన్నే మార్చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. జిల్లా కేంద్రంలో తాజాగా శుభకార్యాలు జరిగిన పలువురు నాయకుల ఇండ్లకు వెళ్ళి కలిశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సర్పంచ్ లకు ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పదవిలో నుండి పోయేముందు కూడా గౌరవంగా పంపించాలని భావనతో ఆత్మీయ సత్కారం కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. పదవులు వస్తాయి, పోతాయి, అంతేకాని శాశ్వతం కాదు. పదవిలో ఉన్నప్పుడు ఎంత మంచిగా పనిచేశారన్నదే ముఖ్యమన్నారు కేటీఆర్. పదవిలో ఉన్నప్పుడు అన్ని విధాలా మంచిగా పనిచేశారు కాబట్టే, ప్రజలు కెసిఆర్ ముఖ్యమంత్రి కాలేదన్నది జీర్ణించుకోలేక పోతున్నారని, ఓ కవి రాసిన పాట, పల్లే కన్నీరు పెడుతుందోయ్ అనే పాట ప్రభుత్వాన్నే మార్చేసిందన్నారు.
Also Read
- విరాట్ కోహ్లీ వాడే 'హూప్' కి పోటీగా Google Fitbit Air.. ఇక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే..
- RRB JE Recruitment 2026: 4,098 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. అర్హత, ఫీజు, దరఖాస్తు విధానం ఇవే
- Hyderabad: పెద్ద కొడుకు జైల్లో.. చిన్న కుమారుడు గంజాయి బానిస.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
- India - Pakistan: మొదట భారత్ తరఫున ఆడి.. ఆ తర్వాత పాకిస్థాన్ తరఫున ఆడిన క్రికెటర్లు వీరే..!
తెలంగాణ లో లాగా ప్రతి పల్లెలో డంప్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, వైకుంఠvధామాలు, ట్యాంకర్ లు , ట్రాక్టర్లు, నర్సరీలు లాంటివి ఏ రాష్ట్రంలో ఉన్నాయో చూపించాలని చాలెంజ్ చేస్తున్నానన్నారు. సర్పంచ్ లు చాలా కష్టపడి పని చేసి ఓడిఎఫ్ ప్లస్ గా రాష్ట్రంగా మార్చినందుకు సలాం చేస్తున్నానని, 2014 నుండి ఇప్పటి వరకు మన రాష్ట్రానికే 82 అవార్డులు వచ్చాయని, దేశంలోనే 30 శాతం అవార్డులు మన రాష్ట్రానికే వచ్చాయని తెలపడానికి గర్వంగా ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి సంసద్ ఆవాస్ యోజన పథకం లో దేశంలోనే టాప్ ట్వంటీ లో 19 గ్రామాలు మనవే కావడం గొప్ప విషయమన్నారు. పెండింగ్ బిల్లుల సమస్య పై మీ తరుపున ప్రభుత్వం తో మాట్లాడడానికి, గొంతు విప్పడానికి నేను సిద్దంగా ఉన్నా అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
IND vs SL 1st Test: టీమిండియా ప్లేయింగ్ 11పై కోచ్ కీలక హింట్.. బెంచ్‌లోనే ఆ నలుగురు!
-
Sankranti Box Office Clash : అందరికీ సంక్రాంతే కావాలి.. సినిమా పట్టాలెక్కకముందే పండగ రేసుపై కర్చీఫ్
-
విరాట్ కోహ్లీ వాడే ‘హూప్’ కి పోటీగా Google Fitbit Air.. ఇక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే..
-
RRB JE Recruitment 2026: 4,098 పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. అర్హత, ఫీజు, దరఖాస్తు విధానం ఇవే
-
Realme P4s Lite: రియల్మీ P4s లైట్.. 7000mAh బ్యాటరీతో చౌకైన ఫోన్.. ఫీచర్లు అదిరిపోయేలా!
ట్రెండింగ్
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్‌కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్‌కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!