KTR: కేసీఆర్‌ను విచారణకు పిలవడం మీ అహంకారం కాకపోతే మరేమిటి?.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్!
- ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడిన కేటీఆర్..
- కేసీఆర్ పై ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి..
- కేసీఆర్ లేని ఇంటికి రాత్రి వేళ నోటీసులు అంటించి వెళ్లడం దారుణం: కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి? అంటూ ప్రశ్నించారు. స్వయంగా కేసీఆర్ రే తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణం అన్నారు. ఇది అహంకారం కాకపోతే మరేమిటి? అని అడిగారు. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దనే విచారించాలన్న రూల్ కూడా అతిక్రమిస్తున్నారు పోలీసులు.. అసలు మీ పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా?.. లేక మీ చేతిలో కీలు బొమ్మల్లా ఇట్లా ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనా? అని కేటీఆర్ మండిపడ్డారు.
Read Also: Family Suicide: హైదరాబాద్‌లో పెను విషాదం.. రైలు కింద పడి సూసైడ్ చేసుకున్న ఓ కుటుంబం..
Also Read
- India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
- Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
అయితే, చట్టం మీద, న్యాయం మీద, ధర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు.. కానీ మాకు వాటి మీద పూర్తి విశ్వాసం ఉందని కేటీఆర్ అన్నారు. ఈ అక్రమ కేసులన్నీ ఛేదిస్తాం.. మీ ప్రతి తప్పుడు పనిని వెలికి తీసి తెలంగాణ ప్రజల ముందు పెడతామని పేర్కొన్నారు. మీరు ఎన్ని వేధింపులకు పాల్పడుతున్నారో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.. తప్పకుండా సమయం వచ్చినప్పుడు మీకు ప్రజాక్షేత్రంలోనే వారు బుద్ధి చెబుతారని కేటీఆర్ ఎక్స్ లో పెట్టిన పోస్టులో రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!