KTR: శాసన సభ నడిచినన్ని రోజులు లగచర్ల ఘటనపై కొట్లాడుతాం..
- ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పే వరకు పోరాటం చేస్తాం
- అసెంబ్లీ నడిచినన్ని రోజులు లగచర్ల ఘటనపై కొట్లాడుతాం.-కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: తమ భూమి తమకే ఉండాలని కొట్లాడిన పాపానికి లగచర్ల రైతులను జైల్లో పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారన్నారు. లగచర్ల ఘటనపై చర్చ పెడదాం అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. పురుషులను జైల్లో పెట్టి.. ఆడవారిని ఇంటికి వెళ్లి బెదిరిస్తున్నారన్నారు. కొడంగల్ ప్రజలకు తాము అండగా ఉంటామన్నారు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పే వరకు పోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. శాసన సభ నడిచినన్ని రోజులు లగచర్ల ఘటనపై కొట్లాడుతామన్నారు.
Read Also: TG Assembly: లగచర్ల రైతులకు బేడీల విషయంలో బీఆర్ఎస్ నిరసన.. అసెంబ్లీ రేపటికి వాయిదా
Also Read
- Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
- Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
- ALP: ఒంగోలులో లోకో పైలట్‌పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
- Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్‌నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
దుర్మార్గమైన, నికృష్టమైన పాలనను ప్రజలు గమనిస్తున్నారని.. తమ భూమి తమకు కావాలని అడ్డు పడితే రైతులను లాఠీలతో కొట్టారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రైతుల మీద చర్చ పెడదాం అంటే.. పర్యాటక శాఖ మీద చర్చ పెట్టారన్నారు. మీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో రెండే పర్యాటకాలు అని.. ఒకటి ఢిల్లీకి ఎక్కే పర్యాటకం, రెండూ దిగే పర్యాటకం అంటూ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి, మంత్రులు 70 సార్లు ఢిల్లీకి పోయారన్నారు. కొడంగల్ రైతుల మీద చర్చ పెడదాం అంటే అసెంబ్లీని వాయిదా వేసుకొని పారిపోయారంటూ ఎద్దేవా చేశారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ కేసీఆర్ పోరాటం చేస్తారని కేటీఆర్ చెప్పారు. పరారీలో ఉన్న వారిని ఇంకా వేధిస్తున్నారని ఆయన అన్నారు. 14 వేల ఎకరాలు గత ప్రభుత్వం సేకరిస్తే రైతులకు భూములు తిరిగి ఇస్తాం అన్నది మీరు అంటూ.. రైతులకు న్యాయం చేసి ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టేది లేదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. లగచర్ల రైతులు 40 రోజులుగా జైల్లో ఉన్నారన్నారు. రైతు వీర్య నాయక్‌కు గుండె పోటు వస్తే బేడీలు వేసి ట్రీట్మెంట్ చేసిన దిక్కుమాలిన ప్రభుత్వమంటూ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.
తాజావార్తలు
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
-
ALP: ఒంగోలులో లోకో పైలట్‌పై దాడి.. రైల్వే అధికారుల దర్యాప్తు..
-
Pakistan: మమ్మల్ని కాపాడినందుకు ట్రంప్‌నకు రుణపడి ఉంటాం: షహబాజ్ షరీఫ్..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!