KTR: కరీంనగర్ సింహగర్జనతో కేసీఆర్ ఉద్యమబాట పట్టారు..
- కరీంనగర్ ప్రజలు ఉద్యమ స్పూర్తి చూపకుంటే తెలంగాణ వచ్చేది కాదు
- కరీంనగర్ సింహగర్జనతో కేసీఆర్ ఉద్యమబాట
- చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించారు
- అల్గునూర్ దీక్షా దివస్ సభలో కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: తెలంగాణకు పునర్జన్మనిచ్చింది కరీంనగర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కరీంనగర్ ప్రజలు ఉద్యమ స్పూర్తి చూపకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. కరీంనగర్ జిల్లా అల్గునూర్‌లో దీక్షా దివస్ సభలో కేటీఆర్ ప్రసంగించారు. 1956 నుంచి 1968 వరకు తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. 1969 నుంచి తెలంగాణ ఉద్యమం మొదలయ్యిందన్నారు. తొలిదశ ఉద్యమంలో 370 మంది బలిదానం అయ్యారని.. 1971 నుంచి 30 ఏళ్ళ పాటు మేధావులు ఉద్యమకారులు ఎదురు చూశారన్నారు. అప్పుడే కలిసివచ్చే కాలానికి కేసీఆర్ నడిచి వచ్చాడన్నారు. కరీంనగర్ సింహగర్జనతో కేసీఆర్ ఉద్యమబాట పట్టాడన్నారు.
Read Also: Minister Komatireddy: వచ్చే నెలలో ఇందిరమ్మ ఇండ్ల పథకం.. మంత్రి కీలక ప్రకటన
Also Read
పదవులు త్యాగం చేసి 2001లో టీఆర్ఎస్ను స్థాపించి రాజీలేని పోరాటం చేశారన్నారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించారని కేటీఆర్ పేర్కొన్నారు. 2001 నుంచి 2014 వరకు ప్రజా ఉద్యమం సాగించారన్నారు. ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమంతో విధిలేని పరిస్థితుల్లో అనాడు కాంగ్రెస్ రాష్ట్రం ఇచ్చిందన్నారు. రాష్ట్రం సాధించిన ఘనత కేసీఆర్, తెలంగాణ ప్రజలకు దక్కుతుందన్నారు. సోనియా తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ అడుక్కునే పరిస్థితి అంటుండు నేడు గద్దెనెక్కిన వాళ్లు అంటున్నారని.. కేసీఆర్ కాలి గోరుకు సరిపోడన్నారు. ఎక్కడికైనా పోదాం.. ఏడాది పాలన ఎలా ఉందో ప్రజలు చెబుతారన్నారు.
ఏదో సాధించినట్లు విజయోత్సవాలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఐదేళ్ళ కాంగ్రెస్ పాలన కర్కశత్వం వల్ల వందల మంది ఆత్మబలిదానం చేశారన్నారు. బలిదానాలు ఆపడానికి అనేక రకాల పోరాటం చేశామన్నారు. మరోసారి పోరాట బాట పట్టాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు ఉందన్నారు. దీక్షా దివస్ స్పూర్తిగా కేసీఆర్ దీక్ష స్పూర్తితో పోరుబాట పోరాడుదామని బీఆర్ఎస్ నేతలకు సూచించారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!