NTV Telugu Site icon

KTR: కరీంనగర్ సింహగర్జనతో కేసీఆర్ ఉద్యమబాట పట్టారు..

Ktr

Ktr

KTR: తెలంగాణకు పునర్జన్మనిచ్చింది కరీంనగర్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కరీంనగర్ ప్రజలు ఉద్యమ స్పూర్తి చూపకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. కరీంనగర్ జిల్లా అల్గునూర్‌లో దీక్షా దివస్ సభలో కేటీఆర్ ప్రసంగించారు. 1956 నుంచి 1968 వరకు తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. 1969 నుంచి తెలంగాణ ఉద్యమం మొదలయ్యిందన్నారు. తొలిదశ ఉద్యమంలో 370 మంది బలిదానం అయ్యారని.. 1971 నుంచి 30 ఏళ్ళ పాటు మేధావులు ఉద్యమకారులు ఎదురు చూశారన్నారు. అప్పుడే కలిసివచ్చే కాలానికి కేసీఆర్ నడిచి వచ్చాడన్నారు. కరీంనగర్ సింహగర్జనతో కేసీఆర్ ఉద్యమబాట పట్టాడన్నారు.

Read Also: Minister Komatireddy: వచ్చే నెలలో ఇందిరమ్మ ఇండ్ల పథకం.. మంత్రి కీలక ప్రకటన

పదవులు త్యాగం చేసి 2001లో టీఆర్ఎస్‌ను స్థాపించి రాజీలేని పోరాటం చేశారన్నారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించారని కేటీఆర్ పేర్కొన్నారు. 2001 నుంచి 2014 వరకు ప్రజా ఉద్యమం సాగించారన్నారు. ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమంతో విధిలేని పరిస్థితుల్లో అనాడు కాంగ్రెస్ రాష్ట్రం ఇచ్చిందన్నారు. రాష్ట్రం సాధించిన ఘనత కేసీఆర్, తెలంగాణ ప్రజలకు దక్కుతుందన్నారు. సోనియా తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ అడుక్కునే పరిస్థితి అంటుండు నేడు గద్దెనెక్కిన వాళ్లు అంటున్నారని.. కేసీఆర్ కాలి గోరుకు సరిపోడన్నారు. ఎక్కడికైనా పోదాం.. ఏడాది పాలన ఎలా ఉందో ప్రజలు చెబుతారన్నారు.

ఏదో సాధించినట్లు విజయోత్సవాలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఐదేళ్ళ కాంగ్రెస్ పాలన కర్కశత్వం వల్ల వందల మంది ఆత్మబలిదానం చేశారన్నారు. బలిదానాలు ఆపడానికి అనేక రకాల పోరాటం చేశామన్నారు. మరోసారి పోరాట బాట పట్టాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు ఉందన్నారు. దీక్షా దివస్ స్పూర్తిగా కేసీఆర్ దీక్ష స్పూర్తితో పోరుబాట పోరాడుదామని బీఆర్‌ఎస్ నేతలకు సూచించారు.