KTR : రేవంత్ అబద్ధాల హామీలు అమలు ఎప్పుడు చేస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఇవాళ కేటీఆర్ మాట్లాడుతూ.. కరీంనగర్ గతంలో ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా సింహ గర్జన సభ వేదిక అయిందని, ప్రస్తుతం అబద్ధాల రేవంత్ కి వ్యతిరేకంగా కదనభేరి నిర్వహిస్తున్నామన్నారు. జేబులో కత్తెర్లు పెట్టుకుని తిరుగుతున్న అని జేబుదొంగ లాగా మాట్లాడుతున్నాడు రేవంత్ అని, మానవ బాంబులు అవుతాం అని రేవంత్ అంటున్నారు.. మీ ప్రభుత్వాన్ని కూల్చే బాంబులు ఖమ్మం బాంబు, నల్గొండ బాంబు మీ పార్టీలోనే ఉన్నాయన్నారు. రేవంత్ ప్రభుత్వాన్ని మేము కూల్చము… ఆయన ఐదేళ్లు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నామన్నారు కేటీఆర్. మీరిచ్చిన ఫోర్ ట్వంటీ హామీలను అమలు చేయాలని కోరుతున్నామని, రేవంత్ అబద్ధాల హామీలు అమలు ఎప్పుడు చేస్తారన్నారు.
అంతేకాకుండా..’రేవంత్ మగాడు అయితే మల్కాజిగిరి కి వచ్చి పోటీ చెయ్.. గెలువు. దమ్ముంటే మొగాడివైతే ఇచ్చిన హామీలని అమలు చెయ్యి.. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చెయ్యి… ఎండుతున్న పంటలకు నీళ్లు ఇవ్వు మొగాడివైతే. తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేలా గుజరాత్ మోడల్ అంటున్నారు రేవంత్ సిగ్గుందా. రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ బేకార్ మాడల్ అంటారు… గుజరాత్ మోడల్ అంటే రైళ్లను తగలబెట్టడమా? కాలం కాలేదు కరువు వచ్చింది అంటున్నారు ఇది కాలం కాని కరువు కాదు… ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు… తెలంగాణ భౌగోళిక వాతావరణ పరిస్తితి పై సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి కేసీఆర్ అందుకే ప్రాజెక్టులు కట్టారు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఈ పిచ్చోళ్ళకు తెలియదు. బండి సంజయ్ కి, రేవంత్ కి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఏమి తెలియదు. మెడిగడ్డలో రెండు పిల్లర్లు దెబ్బతిన్నాయి…
Also Read
- Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
- Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
- PM Modi: తొలిసారి ‘బుక్‌మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ బోర్డు
- Sajjala Ramakrishna Reddy: ‘డీఎస్సీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి’..
దాన్ని రిపేర్ చేయకుండా రాద్దాంతం చేస్తున్నారు. కరీంనగర్ నుంచి బద్దం ఎల్లారెడ్డి, చొక్కారావు కేసీఆర్ లాంటి హేమాహేమీలు ఎంపీలు అయ్యారు. బండి సంజయ్ లాంటి మహానుభావుడు అటువంటి కరీంనగర్ నుంచి ఎన్నికవడం సిగ్గుచేటు. కరీంనగర్ కి ఏమి చేసావు సంజయ్…? కరీంనగర్ కమాన్ దగ్గర చర్చ చేద్దాం సిద్ధమా. కరీంనగర్ కి ఒక్క బడి తెచ్చినవా? కనీసం ఒక్క గుడి కూడా తేలేదు. నీ తల్లికే నువ్వు పుట్టినవ అని మంత్రి పొన్నంని అనే చిల్లర గాడు సంజయ్ ఎంపీగా అవసరమా? దేశం కోసం ధర్మం కోసం అంటున్న సంజయ్.. ధర్మం కోసం చేస్తే ఓ మఠం పెట్టుకో సంజయ్… ఈ కాంగ్రెస్ రేవంత్ కాంగ్రెస్… ఇది మామూలు కాంగ్రెస్ కాదు. ఎన్నికలు ముగియగానే రేవంత్ రెడ్డి మరో ఏక్ నాథ్ షిండే, హిమంత బిశ్వశర్మ గా మారడం గ్యారంటీ. కాంగ్రెస్ ని రేవంత్ వీడటం ఖాయం’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Nivin Pauly: నివిన్ పాలీ సెన్సేషన్.. మోహన్‌లాల్ తర్వాత మొత్తం ఇండస్ట్రీలోనే ఆ రికార్డ్ కొట్టిన ఏకైక హీరో!
-
Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
-
Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
-
Jr NTR: ఆ హీరోల సినిమాలకు హెల్ప్ ఓకే.. మన సినిమాల మాటేంటి?
-
PM Modi: తొలిసారి ‘బుక్‌మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ బోర్డు
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!