KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Reviews Nani’s The Paradise: న్యాచురల్ స్టార్ నాని నటించిన పిరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో, ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్కును దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఆదరణ పెరుగుతోంది. తాజాగా ఈ సినిమాను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీక్షించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ 35mm థియేటర్లో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిలత కలిసి సినిమాను చూశారు. అనంతరం కేటీఆర్ తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
‘‘అస్థిత్వం కోసం ఆరాటం, అణిచివేత పై పోరాటం. సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి అనే సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెల కి హృదయపూర్వక అభినందనలు కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. తమ్ముడు ప్రియదర్శికి ప్రత్యేక అభినందనలు ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా!!’’ You know who that is” అని ఎక్స్ వేదికగా కేటీఆర్ తన రివ్యూని పంచుకున్నారు. ఇదిలా ఉండగా.. ప్యారడైజ్ సినిమాలో కేసీఆర్ పాత్ర ఎంతగానో ఆకట్టుకుంటోంది. కేసీఆర్‌ను పోలిన ఎమ్మెల్యే శంకరన్న పాత్రకు సంబంధించిన సన్నివేశాలు కనిపించగానే అభిమానులు పెద్ద ఎత్తున అరిచారు. ఆ సీన్ రాగానే కేటీఆర్ సైతం చిరునవ్వు చిందించడం ఆకట్టుకుంది. ఇక, ఈ సినిమా అయిపోగానే థియేటర్ బయట కేటీఆర్ మాట్లాడుతూ.. ఓ సమాజంపై అణిచివేత జరిగినప్పుడు ఒక నాయకుడు వచ్చి పోరాటం చేసి గుర్తింపు తెచ్చిన కథ అద్భుతంగా ఉందన్నారు. తెలంగాణ, యాస, భాషతో సినిమాను తీర్చిదిద్దారని, ఇది ఎంతో ఆకట్టుకుందని కొనియాడారు.
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
అస్థిత్వం కోసం ఆరాటం, అణిచివేత పై పోరాటం.
సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి అనే సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెల కి హృదయపూర్వక అభినందనలు
కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. తమ్ముడు ప్రియదర్శి కి ప్రత్యేక అభినందనలు…
— KTR (@KTRBRS) September 26, 2026
తాజావార్తలు
-
KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
-
India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
-
LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?