KTR : ఇది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు.. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీట్ (NEET) ఎగ్జామ్ లో జరిగిన అవకతవకలపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ కు సంబంధించిన కీలకమైన ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది వైద్య విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే నీట్ ఎగ్జామ్ కు సంబంధించిన కొన్ని వ్యవహారాలు చూస్తుంటే కచ్చితంగా అవకతవకలు జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం నీట్ ఎగ్జామ్ లో 67 మంది విద్యార్థులు 720 కి 720 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. దీనితో తోడు ఈ సారి చాలా మంది విద్యార్థులు 718, 719 మార్కులు సాధించారు. నీట్ లో (+4, -1) మార్కింగ్ విధానం ఉంటుంది. ఈ లెక్కన 718, 719 మార్కులు రావటమన్నది సాధ్యమయ్యే పనికాదన్నారు. దీని గురించి ప్రశ్నిస్తే ‘గ్రేస్ మార్కులు’ ఇచ్చామని చెబుతున్నారు. కొంతమంది విద్యార్థులకు ఏకంగా 100 వరకు గ్రేస్ మార్కులు ఇచ్చినట్లు తెలుస్తోంది. గ్రేస్ మార్కుల కోసం ఏ విధానం అవలంభించారన్నది చెప్పకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. నీట్ ఫలితాలను ప్రిపోన్ చేసి ఎన్నికల ఫలితాల రోజే హడావుడిగా ఎందుకు విడుదల చేయటం కూడా ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోందన్నారు. కొత్తగా ఏర్పడిన ఎన్డీయే సర్కార్ రానున్న రోజుల్లో ఇలాంటి సమస్యలకు సంబంధించి చాలా సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. ఐతే నీట్ ఎగ్జామ్ విషయంలో బీఆర్ఎస్ తరఫున పలు పశ్నలతో పాటు కొన్ని డిమాండ్లను కేంద్రం ముందుంచారు కేటీఆర్.
Also Read
- Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
- Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
- Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
- Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
కేంద్రానికి కేటీఆర్ ప్రశ్నలు, డిమాండ్లు.
1) గత 5 ఏళ్లలో తెలంగాణా నుంచి ఏ విద్యార్థి కూడా నీట్ (NEET) లో టాప్ 5 ర్యాకింగ్ లో లేరు. దీనికి కచ్చితంగా నీట్ ఎగ్జామ్ లో జరుగుతున్న అక్రమాలే కారణమని మేము నమ్ముతున్నాం.
2) గ్రేస్ మార్కుల కేటాయింపు కోసం అనుసరించిన విధానాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఒక ప్రామాణిక పద్దతిలో ప్రతి విద్యార్థికి మేలు చేసేలా ఈ విధానం ఉండాలని బీఆర్ఎస్ కోరుతుంది. కానీ 1500 మంది విద్యార్థుల గ్రూప్ కు మాత్రమే మేలు చేసే విధంగా గ్రేస్ మార్కులు కలిపారు. అది సరైన విధానం కాదు.
3) ఈ మొత్తం వ్యవహారంపై హై లైవల్ ఎక్స్ పర్ట్ కమిటీతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. నీట్ ఎగ్జామ్ లో జరిగిన అవకతవకలు, అక్రమాలను బయటపెట్టి అన్యాయం జరిగిన విద్యార్థులకు వారి కుటుంబాలకు న్యాయం చేయాలి. అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి.
తాజావార్తలు
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..