KTR Sends Legal Notice to Bandi Sanjay: కేంద్రమంత్రి బండి సంజయ్‌కి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ లీగల్ నోటీసు పంపారు. ఫోన్ టాపింగ్ కేసులో బండి సంజయ్ అడ్డగోలుగా, అసత్యపూరితంగా చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ లీగల్ నోటీస్ పంపారు. కేంద్రమంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రజాప్రతినిధి మరొక ప్రజా ప్రతినిధిపై అసత్య ఆరోపణలు చేయడం దుర్మార్గం అంటూ నోటీసులలో పేర్కొన్నారు.
Also Read: Bandi Sanjay: గుడిలో పూజలు చేస్తే తప్పేంటి?.. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తారా?
కేవలం రాజకీయ ఉనికి కోసమే కేటీఆర్ పైన అసత్యపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని న్యాయవాదులు నోటీసులో పేర్కొన్నారు. తమ క్లైంట్‌కి వెంటనే క్షమాపణ చెప్పాలని బండి సంజయ్‌కి పంపిన లీగల్ నోటిలో న్యాయవాదులు తెలిపారు. భవిష్యత్తులో అడ్డగోలు, అసత్య ఆరోపణలు చేయకుండా ఉండాలని సూచించారు. లేదంటే తదుపరి లీగల్ నోటిస్‌తో పాటు చట్టంలో అందుబాటులో ఉన్న క్రిమినల్ చర్యలకు కూడా బండి సంజయ్ బాధ్యుడు అవుతారని హెచ్చరికలు జారీ చేశారు. బండి సంజయ్ ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. నోటీసులపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.
