NTV Telugu Site icon

KTR : ఇప్పుడు రుణమాఫీ లేదు, బోనస్ లేదు, రైతు భరోసా ఏదీ లేదు

Ktr

Ktr

ఇబ్రహీంపట్నoలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో నిర్వహించిన దసరా సమ్మేళనం అలయ్ బలయ్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, వాళ్ల పాలనలో ఈ సారి దసరా దసరా లెక్క లేదు, బతుకమ్మ, వినాయక చవితి పండుగలు గతంలో మాదిరిగా జరగలేదన్నారు. రెండు పంటలకు కాదు మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గతంలో అన్నాడని, కేసీఆర్ ముష్టి రూ. 10 వేలు ఇస్తున్నాడు. మేము అధికారంలోకి వస్తే రూ. 15 వేలు ఇస్తా అన్నాడన్నారు. కానీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చావు కబురు చల్లగా చెప్పిండని, నాట్లు కాదు కోతలు కూడా అయిపోతున్నాయి…రైతు భరోసా ఏదీ అంటే… ఈ ఖరీప్ సీజన్ కు పైసలు లేవు అన్నాడని కేటీఆర్‌ మండిపడ్డారు. మేము ఖరీఫ్ రైతు భరోసా ఎగగొడుతున్నామని సిగ్గు లేకుండా చెప్పిండని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. 15 వేలు ఎస్తా అన్న సిపాయి… ఇప్పుడు 10 వేలు కూడా వేసే పరిస్థితి లేక తప్పించుకుంటున్నాడని, బీఆర్ఎస్ అంటేనే భారతీయ రైతు సమితి. మేము ఎలాగు రైతుల కోసం పోరాటం చేస్తామన్నారు కేటీఆర్‌. కానీ రైతు సంఘాలు ఎందుకు మూగబోయాయి.. కమ్యూనిస్టులు ఎక్కడ పోయారని ఆయన అన్నారు.

అంతేకాకుండా..’ఎన్నికలకు ముందు రైతు కూలీలు, కౌలు రైతులకు ఆర్థిక సాయం అన్నాడు. బోనస్ అని బోగస్ మాటలు చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు రుణమాఫీ లేదు, బోనస్ లేదు, రైతు భరోసా ఏదీ లేదు. ప్రజలను పట్టించుకోకుండా 25 సార్లు ఢిల్లీకి పోయి 25 పైసలు కూడా తేలేదు. రాష్ట్రం మొత్తాన్ని ఆగం చేస్తున్నాడు. అశోక్ నగర్ లో పిల్లలు ఆందోళన చేస్తున్నది సోషల్ మీడియాలో చూస్తున్నాం. మెయిన్ మీడియాలో చూపిస్తలేరు. ఇదే రాహుల్ గాంధీ…రేవంత్ రెడ్డి వచ్చి అశోక్ నగర్ లో గతేడాది విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ఏడాది లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరో రెండు నెలలు గడిస్తే ఏడాది అవుతది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. పిల్లలకు ఉద్యోగాల సంగతేమో కానీ…రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి మాత్రం ఉద్యోగాలు వచ్చాయి. రిజర్వేషన్ల విషయంలో కూడా వీళ్లు ఇచ్చిన జీవో 29 తో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు పిల్లలను కొడుతున్న పోలీసులు జాగ్రత్తగా ఉండాలె. అందులోంచే మీ బాస్ లు వస్తారన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. గతంలో మనం చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్లతోనే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఈ చిట్టి నాయుడు ఎంత ? చిట్టి నాయుడుకు ఏం తెలియదు. తిట్టుమంటే మాత్రం తిడుతాడు. ఫ్రీ బస్ అన్నాడు. ఆ ఫ్రీ బస్ లలో ఆడోళ్లు కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఒకటి, రెండు కాదు అన్ని అబద్దాల హామీలే. రేవంత్ రెడ్డి 11 నెలల్లో చేసిన ఒక్క మంచి పని అయినా చేసిండా ? మంత్రిగా కూడా అనుభవం లేదు కదా ఏం చేస్తావంటే ఏముంది గుంపు మేస్త్రి మాదిరిగా పని చేస్తా అన్నాడు. ఇప్పుడేమో అందరీ ఇళ్లను కూలగొడుతున్నాడు.

Viral Video: ఏఐ సాంకేతికతతో 60 ఏనుగుల ప్రాణాలు కాపాడిన లోకో పైలట్.. వీడియో వైరల్

సోనియాగాంధీని బలిదేవత అన్నాడు. రాహుల్ గాంధీ ని ముద్దపప్పు అన్నాడు. కాంగ్రెస్ పార్టీ ని ఏ టూ జడ్ కుంభకోణాల పార్టీ అన్నాడు. ఇప్పుడు సోనియా గాంధీ దేవత అంటున్నాడు. మోసం చేస్తానని రేవంత్ రెడ్డి ముందే చెప్పిండు. ఆయనను అనటానికి ఏమీ లేదు. ఓడిపోవటానికి మనం కూడా కొన్ని చిన్న తప్పులు చేశాం. కానీ ఒక్కోసారి ఓటమి కూడా మన మంచికే. దసరా రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మోసపోయామంటూ బాధపడ్డారు. ప్రతి ఒక్కరూ కేసీఆర్ గారిని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రాం రాం, దళిత బంధు కు జై భీమ్ అంటారని కేసీఆర్ గారు ముందే చెప్పారు. ఇప్పుడు అలాగే చేస్తున్నారు. వీళ్లు మళ్ల కూడా రైతు భరోసా ఇచ్చుడు అనుమానమే. రైతు బంధును ఇచ్చే గొట్టే కుట్ర చేస్తున్న లంగలు వీళ్లు. విప్రో సీఈఓ సత్య నాదెళ్ల అని అంటాడు. ఆయన ఏమీ మాట్లాడుతున్నాడో కూడా తెలియటం లేదు. ఏమన్నా అంటే నీ ఇళ్లు కూలగొడుతా అంటాడు. నీకు అంత ఊబలాటం ఉంటే…నా ఇళ్లు చట్టానికి వ్యతిరేకంగా ఉంటే కూలగొట్టాలంటే కూలగొట్టు. నా ఇళ్లు కూలగొడితే నీ కళ్లు చల్లబడుతాయంటే కూలగొట్టు. కానీ పేదల ఇళ్ల జోలికి వెళ్లకు. మూసీ ప్రక్షాళణ కోసం ఎస్టీపీలు కట్టాం. గోదావరి నీళ్లను అనుసంధానం చేసే పని మేమే చేశాం. ఇంకా ఏం అవసరముందని మూసీకి అన్ని పైసలు ఖర్చుపెట్టటం? మీ సోకులు, ఢిల్లీ కి పైసల కోసం మాత్రమే మీరు మూసీ అనే పని పెట్టుకున్నారు. కాలుష్యం లేకుండా గ్రీన్ ఫార్మాసిటి నిర్మించేందుకు కేసీఆర్ గారు కృషి చేశారు. ఎనిమిదేళ్లు కష్టపడి రైతులను ఒప్పించి, మెప్పించి 14 వేల ఎకరాలు సేకరించాం. కోమటి రెడ్డి, కోదండ రెడ్డి, సీతక్క, రేవంత్ రెడ్డి మీ భూములు గుంజుకుంటున్నారంటూ అప్పుడు తప్పుడు ప్రచారం చేశారు. మేము అధికారంలోకి వస్తే మీ భూములు మీకు ఇస్తామంటూ హామీ ఇచ్చారు.

Srinivas Goud : రైతు భరోసా ఎగగొట్టడం రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయడమే

అధికారంలోకి వచ్చాక ఫార్మా సిటీ రద్దు చేశామన్నారు. మరి మీ భూమలు మీకు ఇవ్వాలి కదా? చట్టం ప్రకారం ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములను వేరే దానికి వాడటానికి వీలు లేదు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఈ ప్రభుత్వం ఎంత దొంగ ప్రభుత్వమో వాళ్లు కోర్టుకు చెప్పిన మాటలను బట్టి అర్థం చేసుకోవాలె. ఇక్కడ ఫార్మా సిటీ రద్దైందంటారు. కోర్టులో మాత్రం ఫార్మా సిటీ ఉందని అంటున్నారు. ఫోర్త్ సిటీ కోసం నాలుగు ఇంచుల భూమిని కూడా సేకరించలేదు. మరి ఫార్మాసిటీ రద్దు చేస్తే…ఫోర్త్ సిటీ ఎలా నిర్మిస్తారు. అన్ని దొంగ మాటలే. నిన్ను వదిలిపెట్టం, అసెంబ్లీలో, కోర్టులో, ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తూనే ఉంటాం. ఫార్మాసిటీ విషయంలో హైకోర్టులో న్యాయం దొరకకపోతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాం. గల్లీ, గల్లీ తిరిగి రేవంత్ రెడ్డి మోసాలను ప్రజలకు వివరిస్తాం. కట్టేదుంటే దమ్ముంటే ఫార్మా సిటీ కట్టు. లేదంటే వాళ్ల భూమి వాళ్లకు ఇచ్చేయి. కానీ రియల్ ఎస్టేట్ దందా చేస్తా…నా వాళ్లకు భూములు కట్టబెడుతా అంటే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు.’ అని కేటీఆర్‌ అన్నారు.

Show comments