NTV Telugu Site icon

KTR: సివిల్ సప్లయ్ శాఖలో 1100 కోట్ల కుంభకోణంపై హౌస్ కమిటీ వేయాలి.. కేటీఆర్

Ktr

Ktr

KTR About Civil supplies : సివిల్ సప్లయ్ శాఖలో సన్న బియ్యం కొనుగోళ్లలో రూ. 11 వందల కోట్ల స్కాం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శాసన సభలో సివిల్ సప్లయ్ శాఖకు సంబంధించిన పద్దులపై జరిగిన చర్చలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. రేషన్ కార్డులు, రైతులకు పంటలకు సంబంధించిన బోనస్ విషయంలో మా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా బుల్డోజ్ చేస్తుందంటూ ఆయన మండిపడ్డారు. అదే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదంటూ తప్పుడు ప్రచారం చేస్తే.. దానికి సంబంధించిన లెక్కలతో సహా వివరిస్తే దాన్ని కూడా బుల్డోజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.

NTR Bharosa Pensions: రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ.. రూ.2,737.41 కోట్లను విడుదల చేసిన సర్కార్..

ప్రతిపక్షం ఏం చెప్పిన సరే.. ప్రభుత్వానికి రుచించటం లేదని ఆయన విమర్శించారు. సివిల్ సప్లయ్ శాఖలో సన్న బియ్యం కొనుగోళ్లలో ఏకంగా రూ. 11 వందల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. దీనిలో మంత్రి గారి హస్తం లేకపోయిన సరే పెద్దల హస్తం ఉందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సమాధానం ఇస్తున్న తీరుపై బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం ఈ కుంభకోణంపై హౌజ్ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇక ఈ విషయంలో ప్రభుత్వం తీరుకు నిరసనగా అసెంబ్లీ నుంచి బాయ్ కాట్ చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.

Gang Rape Case: వనస్థలిపురం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గ్యాంగ్ రేప్ కేసులో నిందుతుడి అరెస్ట్..