Gang Rape Case: వనస్థలిపురం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గ్యాంగ్ రేప్ కేసులో గౌతమ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసారు పోలీసులు. గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ మరో వ్యక్తి శివాజీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రముఖ కంపెనీలో ఉద్యోగం వచ్చినందుకు మహిళను ట్రీట్ ఇవ్వాలని గౌతం అడిగాడు. దాంతో ట్రీట్ ఇచ్చేందుకు వనస్థలిపురంలోని బార్ & రెస్టారెంట్ కు లేడీ సాప్ట్ వేర్ ఇంజనీర్, గౌతమ్ వచ్చారు. ఈ సమయంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి బలవంతంగా వోడ్కా మద్యం తాగించాడు గౌతమ్. దాంతో మద్యం తాగగానే స్పృహ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోల్పోయింది. స్పృహ కోల్పోయిన మహిళ పై అత్యాచారం చేసాడు గౌతం. అలా అమ్మాయిపై అత్యాచారం చేసిన తర్వాత తన మిత్రుడైన శివాజీని పిలిచాడు గౌతం. అతనితో కూడా కలిసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.
Wayanad Landslides : వాయనాడ్‌లో ప్రకృతి విధ్వంసం… ఇప్పటివరకు 151 మంది మృతి
ఇక కొద్దిసేపటికి మహిళ స్పృహలోకి వచ్చి చూసేసరికి ఇద్దరు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డట్టుగా గుర్తించింది. ఆ సమయంలో హోటల్ గదిలో ఆమె గట్టిగా అరవడంతో అక్కడి నుంచి గౌతమ్, శివాజీలు పారిపోయారు. ఇక జరిగిన గ్యాంగ్ రేప్ విషయాన్ని తన మిత్రులకు చెప్పింది మహిళ. దాంతో ఆ లేడీ సాఫ్ట్వేర్ ని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు ఆమె మిత్రులు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది సాఫ్ట్వేర్ ఇంజనీర్. దింతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ నిందితుడు గౌతమ్ ని పోలీసులు అరెస్ట్ చేయగా.. శివాజీ పరారీలో ఉన్నాడు.
People Media Factory: తగ్గేదేలే అంటున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ