KTR : 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది.. మళ్ళీ కేసీఆరే సీఎం

  • 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి
  • 10 ఏళ్లలో భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే మన మున్సిపాలిటీలను అభివృద్ది చేసుకున్నాం
  • బీఆర్ఎస్ హయంలో 6 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఇచ్చాం : కేటీఆర్‌
Ktr

Ktr

KTR : పదవీకాలం ముగిసిన మున్సిపల్ ఛైర్మెన్, వైస్ చైర్మన్ లకు తెలంగాణ భవన్‌లో ఆత్మీయ సత్కారం చేశారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే మన మున్సిపాలిటీలను అభివృద్ది చేసుకున్నామని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. బీఆర్ఎస్ హయంలో 6 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఇచ్చామని, 700 కోట్లతో నల్లగొండను అభివృద్ది చేసుకున్నామని ఆయన తెలిపారు.

Panchayat Secretaries: విధులకు డుమ్మా కొట్టి.. క్రికెట్ ఆడుతున్న పంచాయతీ సెక్రటరీలు

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతుంది, 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు కేటీఆర్‌. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డీ సొంత నియోజకవర్గంలో మున్సిపల్ ఉద్యోగులకు 4 నెలలగా జీతాలు రావడం లేదని, సూర్యాపేట మున్సిపల్ ఛైర్మెన్ జనరల్ స్థానంలో దళిత బిడ్డకు అవకాశం ఇచ్చామని, టకీ టకీమని ఢిల్లీలో పైసలు పడుతున్నాయి తప్పా…. రైతుల అకౌంట్స్ లో మాత్రం పడడంలేదన్నారు. పదవి కాలం ముగిసిన మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్ లు ప్రజల్లోనే ఉంటే తిరిగి ప్రజలే గెలిపిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.

Regina Cassandra: ఫేమ్ కోసం బాలీవుడ్‌కి సౌత్ యాక్టర్స్ కావాలి :  రెజీనా  క‌స్సాండ్రా