KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు నమోదు చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్రంలో ఉన్న ఒక చవకబారు మంత్రి తన పరిధిలోని పోలీసులను ఉపయోగించుకుని ప్రజాప్రతినిధులపై ఈ తరహా కేసులు పెట్టించారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఓ ట్వీట్ చేశారు. “తెలంగాణ చవకబారు మంత్రి, అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద జరిగిన గొడవ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై తన పోలీసులతో లైంగిక వేధింపుల కేసు నమోదు చేయించారు!!! చట్టాన్ని దిగ్భ్రాంతికరంగా దుర్వినియోగం చేయడం. ఈ పనికిమాలిన కేసులను మేము తప్పకుండా న్యాయస్థానంలో ఎదుర్కొంటాం. కానీ తెలంగాణడీజీపీ గారిని ఒకటి అడగాలనుకుంటున్నాను. హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించిన కాంగ్రెస్ నాయకులపై మిస్ ఇంగ్లాండ్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల సంగతేంటి? తెలంగాణపోలీసులు నిందితులను కాపాడటం కొనసాగిస్తారా? రాహుల్ గాంధీ గారూ, ఏమైనా సమాధానాలు ఉన్నాయా?” అంటూ ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
The cheap minister of Telangana made his police file a sexual harassment case on BRS MLAs and MLCs in the context of the melee at assembly entry point !!! Shocking abuse of law
Also Read
We of course will fight this rubbish cases in court of law
But let me ask @TelanganaDGP Garu
Whatever happened to the sexual harassment allegations of Miss England against Congress leaders who misbehaved with her during the Miss World contest in Hyderabad?
Will the @TelanganaCOPs continue to shield the accused ?
Any answers Mr @RahulGandhi ?
— KTR (@KTRBRS) September 12, 2026
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?