KTR : హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కాంగ్రెస్ ఏడాది పాలనపై రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌ను ప్రదర్శించారు. ఈ ఫిల్మ్‌ను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో రూపొందించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ప్రముఖ బీఆర్ఎస్ నేతలు హాజరై ఫిల్మ్‌ను తిలకించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, గాంధీభవన్ వెలవెలబోతుండగా, తెలంగాణ భవన్ రోజూ సందడిగా ఉండటం విశేషమని తెలిపారు. వచ్చే ఏప్రిల్‌తో బీఆర్ఎస్ పార్టీ స్థాపనకు 25 ఏళ్లు పూర్తవుతాయని, గత ఏడాది పార్టీకి అత్యంత కఠినమైన సమయమని వివరించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ప్రజలు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీని ఆశ్చర్యకరంగా ఓడించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ కవిత జైల్లో ఐదు నెలలు ఉండడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని అన్నారు.
Narayana Murthy: కింగ్ ఫిషర్ టవర్స్‌లో ఫ్లాట్ కొనుగోలు చేసిన నారాయణ మూర్తి.. ధర ఎంతంటే?
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం , పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల్లో విజయాలు సాధించలేకపోవడం వంటి విషయాలను కేటీఆర్ ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై సంవత్సరంలోనే వ్యతిరేకత పెరుగుతోందని, రైతుల సమస్యలను ఢిల్లీ వరకు తీసుకెళ్లిన విషయాన్ని వెల్లడించారు. అలాగే, పెండింగ్ బిల్లులపై మాజీ సర్పంచులు, ఆశా వర్కర్లు తమ డిమాండ్లు ఉంచుతున్నారని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలపై పోరాడుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. అధికారం కోల్పోయినప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ పోరాట తత్వం కోల్పోలేదని, ప్రజల మద్దతు ఇంకా తమ పార్టీకి ఉందని నమ్మకం వ్యక్తం చేశారు.
Immunity Booster: మీకు ఇమ్యూనిటీ తగ్గిందా..? పెంచే ఆయుర్వేద ఔషధం ఇదే!