KTR : హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శనివారం బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కాంగ్రెస్ ఏడాది పాలనపై రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌ను ప్రదర్శించారు. ఈ ఫిల్మ్‌ను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో రూపొందించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ప్రముఖ బీఆర్ఎస్ నేతలు హాజరై ఫిల్మ్‌ను తిలకించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, గాంధీభవన్ వెలవెలబోతుండగా, తెలంగాణ భవన్ రోజూ సందడిగా ఉండటం విశేషమని తెలిపారు. వచ్చే ఏప్రిల్‌తో బీఆర్ఎస్…