KTR: సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.. రేవంత్‌కు దమ్ముంటే 10 మందితో రాజీనామా చేయించి ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు.. ఎన్నికల్లో ఎవరి సత్తా ఏందో తేల్చుకుందామన్నారు.. జోగులాంబ జిల్లా గద్వాలలోని తేరు మైదానంలో నిర్వహించిన ‘గద్వాల గర్జన’ బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయన్నారు. 6 నెలల్లో గద్వాలలో ఉప ఎన్నిక రావడం ఖాయమని చెప్పారు.. 50వేల ఓట్ల మెజార్టీతో గులాబీ జెండా గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.. గద్వాల ఎమ్మెల్యే దొంగల ముఠాలో చేరారని.. పార్టీ మారిన ఎమ్మెల్యేకు బుద్ధి చెబుదామన్నారు.. గద్వాల ఉప ఎన్నికలో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
READ MORE: Singareni : మహిళల కోసం సింగరేణి చరిత్రలో తొలిసారి ఓపెన్ కాస్ట్ మైన్స్ అవకాశం!
“ఉమ్మడి పాలమూరు జిల్లాలో 8 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌ది. గట్టు ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం దాదాపు పూర్తి చేసింది. జో గద్వాలను జిల్లా కేంద్రంగా చేసిన ఘనత కేసీఆర్‌ది. రైలు కింద తలపెడతాను కానీ, పార్టీ మారబోనని గతంలో కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఇప్పుడేమో అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నట్లు చెప్పారు. ఆయన పార్టీ మారుతున్నది.. నియోజకవర్గ అభివృద్ధి కోసమా..? సొంత అభివృద్ధి కోసమా? పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల స్థానాల్లో ఉపఎన్నికలు వస్తాయి. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు చాలా సీరియస్‌గా ఉంది.” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
READ MORE: Saradhyam Public Meeting: ఏపీపై బీజేపీ ఫోకస్.. రేపు విశాఖలో ‘సారథ్యం’ భారీ బహిరంగ సభ..
