Big Breaking : కిషన్ రెడ్డికి కేటీఆర్ సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు సీబీఐకి అప్పగిస్తే సంబరాలు చేసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. దొంగల ముసుగులు తొలగిపోయాయని,స్కామ్ లోని స్వామీజీలతో సంబంధం లేదన్న వాళ్ళు ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. మాకు సంబంధం లేదని భుజాలు తడుముకున్నోళ్లు… దొంగలను భుజాలపై మోస్తున్నారన్నారు కేటీఆర్. కుట్ర కేసు తమ జేబు సంస్ధ సీబీఐకి చిక్కినందుకే కిషన్ రెడ్డి సంబరమా అని ప్రశ్నించారు కేటీఆర్. ఒకప్పుడు సీబీఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్… ఇప్పుడు సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అయిందని ఆయన ఎద్దేవా చేశారు.
Also Read : Police Events : గర్భిణి అభ్యర్థులకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త
సీబీఐ దర్యాప్తుతో పాటు దొరికిన దొంగలపై నార్కో అనాలసిస్, లైడిటెక్టర్ టెస్టులకు సిద్ధమా అని కేటీఆర్ సవాల్ విసిరారు. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రలపై బీజేపీపై ప్రజాక్షేత్రంలో ఎప్పుడో విచారణ ప్రారంభమైందని, తమ అసమర్ధ పాలనతో ప్రజాక్షేత్రంలో బీజేపీనే బద్నాం అయిందన్నారు. కేసు సీబీఐకి వెళ్తే క్లీన్ చిట్ ఇవ్వడం పక్కా అని పబ్లిక్‌గా మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. సీబీఐ సహా వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించిన తీరుకు మీ నిస్సిగ్గు ప్రకటనలే నిదర్శనమన్నారు. ఒకప్పుడు సీబీఐకి కేసు వెళ్తే.. భయపడే పరిస్థితి.. నేడు సంబురాలు చేసుకుంటున్నారు. సీబీఐ సంస్థను బీజేపీ ఎంతగా నీరుగార్చిందో అర్థమవుతోందన్నారు.
Also Read
- Vimal Elaichi Ad Row: ‘‘విమల్’’ యాడ్ చిక్కుల్లో బాలీవుడ్ స్టార్స్.. షోకాజ్ నోటీసులు..
- Nainar Nagendran: సీఎం విజయ్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. తమిళనాడు బీజేపీ చీఫ్‌పై ఫిర్యాదు!
- Guntur Chilli Export: గుంటూరు మిర్చికి శ్రీలంక షాక్.. పదుల సంఖ్యలో కంటైనర్లు రిజెక్ట్!
- Car Accident: పెళ్లి సందడి టు విషాదం.. కాలువలోకి దూసుకెళ్లిన కారు, నలుగురు యువకులు గల్లంతు!
- Tags
- bjp
- breaking news
- BRS
- Kishan Reddy
- ktr
తాజావార్తలు
-
Avengers Doomsday ఐరన్ మ్యాన్ నుంచి డాక్టర్ డూమ్‌గా రాబర్ట్ డౌనీ.. అదరగొడుతున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ప్రోమో
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Vimal Elaichi Ad Row: ‘‘విమల్’’ యాడ్ చిక్కుల్లో బాలీవుడ్ స్టార్స్.. షోకాజ్ నోటీసులు..
-
Nainar Nagendran: సీఎం విజయ్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. తమిళనాడు బీజేపీ చీఫ్‌పై ఫిర్యాదు!
-
Motorola Edge 70 Pro: సగం ధరకే మోటరోలా ఎడ్జ్ 70 Pro.. 50MP కెమెరా, 6500mAh బ్యాటరీ, 8GB RAM తో ప్రీమియం డిజైన్
ట్రెండింగ్
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!