Site icon NTV Telugu

KTR : సిరిసిల్లలో ఉద్రిక్తత.. కేటీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడించిన కాంగ్రెస్ నేతలు..!

Ktr

Ktr

KTR : రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను క్యాంపు కార్యాలయంలో పెట్టేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను, బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంతో ఘాటు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట, పరస్పర దాడులు చోటు చేసుకున్నాయి. కొందరికి గాయాలు కూడా అయ్యాయి. ఉద్విగ్న పరిస్థితుల మధ్య వెంటనే స్పందించిన పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

 Vallabhaneni Vamsi: గుంటూరు జీజీహెచ్‌లో వంశీకి చికిత్స.. పోలీసులతో పంకజశ్రీ వాగ్వాదం!

ఘటన సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు “సీఎం డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేయగా, కాంగ్రెస్ కార్యకర్తలు “కేటీఆర్ డౌన్ డౌన్” అంటూ ఎదురుపడ్డారు. ఇదంతా ఒక్కసారిగా జరిగిపోయి ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణాన్ని సృష్టించింది. ఇటీవలి కాలంలో ప్రోటోకాల్ అంశం మీద బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఫోటో లేకపోవడాన్ని వారు తప్పుపడుతున్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ శ్రేణులు కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టాలని పట్టు పట్టడంతో ఈ ఘటన తలెత్తింది. ప్రస్తుతం కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Pawan Kalyan: ఒకే దేశం, ఒకే ఎన్నిక దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తుంది

Exit mobile version