KTR : రైతు భరోసాను ఎగగొట్టటం రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయటమే
- కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు రాం రాం చెబుతున్నారన్న కేసీఆర్ మాటలను
- రేవంత్ రెడ్డి సర్కార్ అక్షరాల నిజం చేసింది
- వానాకాలం పంట సీజన్ కు రైతుబంధును పూర్తిగా ఎగ్గొట్టేసింది : కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వానాకాలం రైతు భరోసా ను ఎగగొట్టటం రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయటమే అని బీఆర్ఎస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. వెంటనే రైతుల ఖాతాలో రైతు భరోసా వేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గెలిస్తే రైతుబంధుకు రాం రాం చెబుతున్నారన్న కేసీఆర్ మాటలను రేవంత్ రెడ్డి సర్కార్ అక్షరాల నిజం చేసిందన్నారు. వానాకాలం పంట సీజన్ కు రైతుబంధును పూర్తిగా ఎగ్గొట్టేసిందని, లక్షలాది మంది రైతుల నోట్లో మట్టి కొట్టిందన్నారు కేటీఆర్. రేపు, మాపు అంటూ నెట్టుకొస్తున్నప్పుడే ఈ ప్రభుత్వం మీద అనుమానం కలిగిందని, ఇప్పుడు స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చేతులేస్తున్నట్లు ప్రకటించారన్నారు. మీ చేతగానీ తనంతో రైతన్నలను మోసం చేస్తామంటే ఊరుకునేలేదని, సబ్ కమిటీ, గైడ్ లైన్స్ అంటూ పెట్టుబడి సాయాన్ని ఎగ్గొడతామంటే రైతులు వీపు చింతపండు చేస్తారన్నారు కేటీఆర్. ఎద్దు ఏడ్చినా ఏవుసం, రైతు ఏడ్చినా రాజ్యం బాగుపడదంటారని, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా రైతును ఏడిపిస్తున్న కాంగ్రెస్ కు ఉసురు తప్పదన్నారు.
Group-1 Aspirants : సచివాలయం దగ్గర ఉద్రిక్తత.. బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Also Read
- OTR: ఖద్దర్ వర్సెస్ కలెక్టర్
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
అంతేకాకుండా..’రైతు భరోసాకు డబ్బులు లేకపోవటంతోనే సబ్ కమిటీ అంటూ డ్రామాలు స్టార్ట్ చేశారు. కేసీఆర్ పదివేలు ముష్టి వేస్తున్నాడు…మేము రూ. 15 వేలు ఇస్తామన్న సిఫాయి ఎక్కడ? పేదల కడపు కొట్టి రూ. లక్షా 50 వేల కోట్లతో మూసీ సుందరీకరణకు డబ్బులుంటాయా? మీరుచెప్పినట్లు రైతులకు ఎకరానికి రూ. 7500 ఇచ్చేందుకు పైసలు లేవా? ఎట్టి పరిస్థితుల్లో రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాల్సిందే. లేదంటే ఎక్కడికక్కడ మీ ప్రజాప్రతినిధులను ముట్టడిస్తాం. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చే వరకు కాంగ్రెస్ వదిలేది లేదు.’ అని కేటీఆర్ అన్నారు.
Amaravati: రాజధాని పనుల పున:ప్రారంభంపై సీఎం చంద్రబాబు ట్వీట్
తాజావార్తలు
-
OTR: ఖద్దర్ వర్సెస్ కలెక్టర్
-
OTR : నిజామాబాద్ గులాబీ కోటలో గందరగోళం.. నేతల తీరు చర్చనీయాంశం!
-
CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
-
AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
-
God Of War : ‘డ్రాగన్’ తర్వాత కొత్త ప్రాజెక్ట్‌పై ఎన్టీఆర్ ఫోకస్
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!