KTR : తొందర్లోనే స్టేషన్ ఘనపూర్‌లో ఉప ఎన్నిక రాబోతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తొందర్లోనే స్టేషన్ ఘనపూర్ లో ఉప ఎన్నిక రాబోతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. స్టేషన్ ఘనపూర్ లో బీఆర్‌ఎస్ తరుపున రాజయ్య భారీ మెజారిటీతో గెలవబోతున్నారని, కేసీఆర్ కూడా పార్లమెంట్ ఎన్నికల సమయంలో చెప్పారన్నారు. హై కోర్ట్ లో కేసు తీర్పు రిజర్వ్ లో ఉందని, ఈ తీర్పు మనకు అనుకూలంగా వస్తుంది అని ఆశిస్తున్నామన్నారు కేటీఆర్. పార్టీ మారిన ఎమ్మెల్యే లపై వేటు పడడం ఖాయమని, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ తో ఓడిపోయామన్నారు కేటీఆర్. ఈసారి మనమే అధికారంలోకి రాబోతున్నామని, రాష్ట్రం అంతా మోసపోయినా ఘనపూర్ ప్రజలు మాత్రం మోసపోలేదన్నారు కేటీఆర్.
CM Chandrababu: టీడీపీ ఎప్పటికి గుడివాడకు రుణపడి ఉంటుంది..
Also Read
అంతేకాకుండా..’కానీ ఎన్నికల తర్వాత మాతో పాటు ఘనపూర్ ప్రజలు కూడా మోసపోయారు. కేవలం 1.5 శాతం అంటే నాలుగు లక్షల ఓట్ల తేడా తో మనం ఓడిపోయాము. పంద్రాగస్టు లోగా రెండు లక్షల రుణమాఫీ చేస్తాము అని దేవుళ్ళ మీద ఒట్టు వేసి చెప్పారు. కానీ ఈరోజు పంద్రాగస్టు వచ్చింది.. అయినా రుణ మాఫీ కాలేదు. రుణమాఫీ చేస్తున్నాం అని తెలంగాణ కు రావాలని రాహుల్ గాంధీ ని పిలిచారు. రుణమాఫీ చేస్తున్నాం అని బోగస్ మాటలు చెబుతున్నారని తెలిసి రాహుల్ గాంధీ రావట్లేదు అని తెలిసింది. ఈ రోజు సీఎం స్పీచ్ లో రాష్ట్రం అప్పుల పాలైంది అని చెప్పారు. ఒక ముఖ్యమంత్రి గా రాష్ట్రం గురించి ఇలా తక్కువ చేసి మాట్లాడడం చాలా తప్పు. పార్టీ విలీనం అయిపోతుంది అని చిల్లర ప్రచారం చేస్తున్నారు. మేము బెయిల్ కోసం ఢిల్లీ లో తిరుగుతుంటే బీజేపీ వాళ్ళను కలుస్తున్నాం అని విష ప్రచారం చేస్తున్నారు. సొంత చెల్లె జైల్ లో ఉంటే బెయిల్ కోసం తిరిగినా తప్పేనా… త్వరలోనే కేసీఆర్ నియోజకవర్గాలుగా అందరిని కలుస్తారు. ఉప ఎన్నిక వచ్చే స్టేషన్ ఘనపూర్ కార్యకర్తలను మొదటిగా కలుస్తారు. బీసీ రిజర్వేషన్ల విషయం లో కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. బీసీ లకు రిజర్వేషన్లు పెంచకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ నిర్వహిస్తుంది.’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!