కొత్త ప్రధాన కార్యదర్శిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డిని నియమించనున్నారు. ఈ మేరకు నేడు ఉత్తర్వులు జారీ చేయనుంది సీఎంవో. అయితే.. ప్రస్తుతం జవహర్ రెడ్డి ముఖ్యమంత్రి స్పెషల్ సీఎస్‌గా కొనసాగుతున్నారు. అయితే.. తాజాగా కేంద్ర సర్వీసుకు ముఖ్యమంత్రి కార్యదర్శి సల్మాన్ రాజ్ వెళ్లడంతో.. సీఎంఓలో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో.. సీఎస్ స్థానంలోకి జవర్‌రెడ్డిని ప్రమోట్ చేస్తూ నేడు అధికారక ప్రకటన వెలువడనుంది.
Also Read :Kim Jong Un: క్షిపణి ప్రయోగాల వెనుక.. అసలు కారణం చెప్పిన కిమ్
అయితే.. జవహర్ రెడ్డి పోస్ట్ కోసం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు రావత్, పూనం మాలకొండయ్య, ప్రవీణ్ ప్రకాష్ పేర్లు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. డాక్టర్ రెడ్డి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (1990 బ్యాచ్) సీనియర్ అధికారి జవహార్ రెడ్డి. ప్రస్తుతం స్పెషల్ సీఎస్‌గా జలవనరుల శాఖను చూస్తున్నారు. గతంలో, ఆయన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో వివిధ విధాన రూపకల్పన, విధానాల అమలు స్థానాల్లో పనిచేశాడు. అక్టోబరు 2020 నుంచి ఫిబ్రవరి 2022 వరకు తిరుమల-తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు.
Also Read : Top Headlines- @ 9 AM: టాప్ న్యూస్