NTV Telugu Site icon

KRMB: నేడు కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ కీలక భేటీ.. తాగునీటి కేటాయింపులపై చర్చలు

Krmb

Krmb

KRMB: నేడు ఎర్రమంజిల్ జలసౌధలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. వేసవి కాలంలో తాగు నీటి కోసం నీటి కేటాయింపు అంశాలపై ఇరు రాష్ట్రాలు చర్చించనున్నాయి. ఇప్పటికే కేటాయిస్తున్న నీటితో పాటు వినియోగం, నీటి లభ్యతతో పాటు మిగులు జలాల కేటాయింపులపై ఏపీ, తెలంగాణ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. కేఆర్‌ఎంబీ బోర్డు మెంబర్ సెక్రటరీ రాయిపురే, సభ్యులు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నారాయణ రెడ్డి సభ్యులుగా ఉన్న ఈ త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలశయాల్లో తాగునీటి అవసరాలకు గాను ఏపీకి 45 టీఎంసీలు, తెలంగాణకు 35 టీఎంసీలను బోర్డు కేటాయించగా వాటి ఉపయోగంపై కీలక చర్చ జరగనుంది.

Read Also: Pawan Kalyan: నేడు తిరుపతికి పవన్‌ కల్యాణ్‌.. అసంతృప్త నేతలతో భేటీ

త్రిసభ్య కమిటీ గత అక్టోబర్‌లోనే సమావేశమై రెండు రిజర్వాయర్లలో దాదాపు 82కి పైగా టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని నిర్ధారించింది. అందులో ఏపీకి 45, తెలంగాణకు 35 టీఎంసీలను కేటాయించింది. మిగిలిన 2 టీఎంసీలను మే నెల తర్వాత భవిష్యత్‌ అవసరాలకు వినియోగించాలని తెలిపింది. అయితే, తెలంగాణ ఇప్పటికే కోటాకు మించి నీటిని వాడుకుంది. కాగా, ఏపీ తన కోటాలో 42 టీఎంసీలను వినియోగించుకోగా, మరో 3 టీఎంసీలు మిగిలి ఉన్నాయి. తాజాగా ఏప్రిల్‌లో మరో 5 టీఎంసీలను విడుదల చేయాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ గతంలో కేఆర్‌ఎంబీకి లేఖ రాసింది. ఈ అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.