కృతి కర్బంద.. ఒకప్పుడు టాలీవుడ్ రెండు, మూడు సినిమాల్లో కనిపించింది.. అనుకున్న హిట్ టాక్ రాకపోవడంతో బాలీవుడ్ కు వెళ్ళిపోయింది.. అక్కడ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతుంది.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తన లేటెస్ట్ ఫోటోలను పంచుకుంటుంది.. ఇటీవల ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోలను పోస్ట్ చేసింది.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందని ఓ వార్త నెట్టింట షికారు చేస్తుంది..
బాలీవుడ్ హీరో పుల్కిత్ సామ్రాట్ తో నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలయ్యాయి. 2019 నుంచి ప్రేమలో ఉన్న కృతి కర్బంద, పుల్కిత్ ఇప్పుడు మూడు మూళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈనెలలోనే వీరి వివాహం గ్రాండ్ గా జరగనున్నట్లు సమాచారం . మార్చి 13 నుంచి మార్చి 16 వరకు వీరి పెళ్లి వేడుకలు జరగనున్నాయని టాక్. మార్చి 15న వివాహ వేడుక ఢిల్లీలో జరగనున్నట్లు తెలుస్తోంది.. ఈ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు సన్నిహితులు మాత్రమే వస్తున్నట్లు తెలుస్తుంది..
వీరిద్దరూ కలిసి పగల్పంటి, వీరే కి వెడ్డింగ్ చిత్రాల్లో కలిసి నటించారు. చివరగా తైష్ లో కలిసి నటించారు. చాలాకాలంగా వీరిద్దరి ప్రేమాయణం గురించి నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.. ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో నిజమేనని తేలింది.. పుల్కిత్ కు ఇది రెండో వివాహం. గతంలో అతడు శ్వేతా రోహిరాను పెళ్లి చేసుకున్నాడు.. ఆ తర్వ యామీ గౌతమ్ తో ప్రేమాయణం నడిపినట్లు తెలుస్తుంది.. ఇప్పుడు ఫైనల్ గా కృతి కర్బందా తో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు..