బ్రేకప్ చెప్పేసిందనే కోపంతో ఓ యువకుడు తుపాకీతో యువతిపై కాల్పులు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. ఈ ఘటన కేరళలోని కొత్తమంగళంలో జరిగింది. రఖిల్ గతంలో దంత వైద్యురాలు మానసతో ప్రేమాయణం సాగించాడు. అయితే రెండు నెలల క్రితం రఖిల్‌కు మానస బ్రేకప్ చెప్పేసింది. అయినా అతను మానసను వెంబడిస్తుండడంతో ఆమె తండ్రి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో పోలీసుల రఖిల్‌ను స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా రఖిల్ వేధింపులు ఆగలేదు. సోషల్ మీడియాలోనూ ఆ యువతిని టార్చర్ పెట్టాడు. కొద్దిరోజుల కిందట మానస ఉన్న ఊరి సమీపంలోనే ఓ లాడ్జిలో గది తీసుకున్నాడు. సమయం చూసుకొని రహస్యంగా మానస రూమ్ లోపలికి వెళ్లి తుపాకీ తీసి ఆమెపై కాల్పులు జరిపాడు. వెంటనే తనను తాను కాల్చుకోవడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం తెలుసుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.