Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Kota Bommali Success Meet

Kota Bommali : ఇలాంటి సినిమా తీయాలంటే గ‌ట్స్ ఉండాలి !

Published Date :November 25, 2023 , 5:05 pm
By NTV WebDesk
Kota Bommali :  ఇలాంటి సినిమా తీయాలంటే గ‌ట్స్ ఉండాలి !
  • Follow Us :
  • google news
  • dailyhunt

శ్రీ‌కాంత్‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, రాహుల్ విజ‌య్‌, శివాని ముఖ్య‌తార‌లుగా తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల అభినంద‌న‌ల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకుంటూ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రంగా విజ‌య‌ప‌థంలో దూసుకెళుతోంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసింది.

ఈ సంద‌ర్భంగా నిర్మాతల్లో ఒక‌రైన బ‌న్నీవాస్ మాట్లాడుతూ సినిమా కంటెంట్ బాగుంటే మీడియా త‌ప్ప‌కుండా ప్రోత్స‌హిస్తుంద‌నే విష‌యాన్నీ ఈ చిత్రానికి వారు అందిస్తున్న స‌పోర్టుతో మ‌రో సారి ప్రూవ్ అయింది. నాయ‌ట్టు అనే క్లాసిక్ చిత్రాన్ని తెలుగులో క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో చేస్తున్న‌ప్పుడు మొద‌ట్లో కాస్త భ‌య‌ప‌డ్డాను. కానీ ఈ రోజు మీడియా రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంగా వుంది. నిజాయితీగా సినిమా చేశాం. ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. మార్నింగ్ వ‌సూళ్లు త‌క్కువ వున్నా ఫ‌స్ట్ షో టైమ్‌కు మౌత్‌టాక్ తో క‌లెక్ష‌న్లు పెరిగాయి. ఇదే మా సినిమా స‌క్సెస్‌కు నిద‌ర్శ‌నం. ఓ మంచి సినిమా తీశాను అది జ‌నాల‌కు న‌చ్చింద‌నే విష‌యాన్ని మాత్రం కాన్ఫిడెంట్‌గా చెప్ప‌గ‌ల‌ను. తేజ మార్ని ఎంతో ప్ర‌తిభ గ‌ల ద‌ర్శ‌కుడు. ఈ రోజు చిత్రంలో ప్ర‌తి స‌న్నివేశానికి క్లాప్స్ ప‌డుతున్నాయంటే అత‌నే కార‌ణం. భ‌విష్య‌త్‌లో అత‌ను మంచి క‌మ‌ర్షియ‌ల్ ద‌ర్శ‌కుడిగా ఎదుగుతాడు. శ్రీ‌కాంత్ అన్న‌య్య సొసైటీకి ఉప‌యోగ‌ప‌డే పాత్ర ఎప్పూడు చేసిన ఆ సినిమా స‌క్సెస్ అవుతుంద‌ని ఈ చిత్రం మ‌రోసారి నిరూపించింది. త‌ప్ప‌కుండా ఈ చిత్రం మ‌రింత జ‌నాద‌ర‌ణ పొందుతుంద‌నే న‌మ్మ‌కం వుంది* అన్నారు.

హీరో శ్రీ‌కాంత్ మాట్లాడుతూ మీడియా మిత్రులు చాలా మంది ఫోన్ చేసి అభినందిస్తుంటే ఆనందంగా వుంది. ఖ‌డ్గం, ఆప‌రేష‌న్ దుర్యోద‌న రోజులు గుర్తొచ్చాయ‌ని అంద‌రూ అంటున్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో నాకు ఏ చిత్రానికి ఇన్ని ప్ర‌శంస‌లు రాలేదు. ఇలాంటి సినిమా తీయాలంటే గ‌ట్స్ వున్న నిర్మాత‌లు కావాలి. ఆ గ‌ట్స్ నాకు వాసు, విద్య‌లో క‌నిపించాయి. మొద‌ట్లో ఈ చిత్రంలో నా పాత్ర‌ను చేయ‌గ‌ల‌నా అనుకున్నాను. కానీ ధైర్యంగా ఛాలెంజింగ్‌గా తీసుకుని చేశాను. నా కెరీర్‌ను మ‌లుపుతిప్పిన గీతా ఆర్ట్స్ సంస్థ‌లో మ‌ళ్లీ నాకు మ‌రో మంచి స‌క్సెస్ రావ‌డం సంతోషంగా వుంది. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు తేజ గొప్ప ద‌ర్శ‌కుడుగా ఎదుగుతాడు అన్నారు. ఎంతో క‌ష్ట‌ప‌డి , అంద‌రి స‌హ‌కారంతో చేసిన ఈ సినిమాకు ఈ రోజు ఇంత మంచి ఆద‌ర‌ణ దొర‌క‌డం హ్య‌పీగా వుంద‌ని ద‌ర్శ‌కుడు తేజ మార్ని తెలిపారు. శివాని మాట్లాడుతూ సినిమాలో నా న‌ట‌న గురించి అంద‌రూ అమ్మ‌కు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. మంచి కంటెంట్‌తో సినిమ తీస్తే తెలుగు ఆడియ‌న్స్ ఎప్పూడు ఆద‌రిస్తార‌ని ఈ చిత్ర విజ‌యం మ‌రోసారి నిరూపించింది. మౌత్ టాక్‌తో ఈ సినిమాకు ఆద‌ర‌ణ పెరుగుతుంది. ఇదే ఈ చిత్ర స‌క్సెస్‌కు నిద‌ర్శ‌నం అన్నారు. హీరో రాహుల్ విజ‌య్ మాట్లాడుతూ ఇదొక నిజాయితీ అంటెప్ట్‌. సొసైటిలో జ‌రుగుతున్న దానికి రిఫ్ల‌క్ష‌న్ ఇది. శ్రీ‌కాంత్ గారి పాత్ర నా క‌ళ్ల‌లో నీళ్లు తెప్పించింది. నా పాత్ర‌కు కూడా మంచి ప్ర‌శంస‌లు వస్తున్నాయి అన్నారు. సినిమా విజ‌యం ప‌ట్ల స‌హ నిర్మాత భాను త‌న ఆనందాన్ని తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kota Bommali
  • kota bommali success meet

తాజావార్తలు

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions