గత ఏడాది చిన్న సినిమాగా వచ్చి అద్భుత విజయం సాధించిన సినిమాలలో “కోట బొమ్మాళి పీఎస్” మూవీ ఒకటి. మలయాళ సినిమా నయట్టు రీమేక్ గా తెలుగులో వచ్చిన ఈ సినిమా గత ఏడాది నవంబర్ 24న రిలీజైంది.నయట్టు మూవీకి రీమేక్ లో కాస్త మార్పులు చేసి తెలుగు నేటివిటీకి తగినట్లుగా దర్శకుడు సినిమాను రూపొందించాడు.ఈ సినిమాను జోహార్ మూవీ ఫేమ్ తేజ మార్ని డైరెక్ట్ చేశాడు.బన్నీ వాస్ మరియు విద్యా కొప్పినీడి జీఏ2 పిక్చర్స్ బ్యానర్ లో ఈ కోటబొమ్మాళి పీఎస్ ను నిర్మించారు. ఈ సినిమాకు రంజిన్ రాజ్ మరియు మిథున్ ముకుందన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ తోపాటు శివానీ రాజశేఖర్,రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలో నటించారు.అలాగే ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్,మురళీ శర్మ, విష్ణు మరియు దయానంద్ రెడ్డి ముఖ్యమైన పాత్రలు పోషించారు.ఇంట్రెస్టింగ్ కథతో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో బాగానే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కు సిద్ధం అయింది.. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 11 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆహా ఓటీటీ గురువారం (జనవరి 4) వెల్లడించింది.
సంక్రాంతికి ఈ సినిమా తీసుకొస్తున్నట్లు గతంలోనే ఆహా ఓటీటీ చెప్పినా.. తాజాగా డేట్ ను వెల్లడించింది.ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు తమ అధికారాన్ని నిలుపుకోవడం ఎలాంటి ఎత్తులు వేస్తుంటారు. ఈ రాజకీయ చదరంగంలో సామాన్యులతో పాటు కొన్ని సార్లు చట్టాన్ని రక్షించే పోలీసులు కూడా ఎలా బలవుతారు అన్నది కోట బొమ్మాళి సినిమాలో దర్శకుడు చక్కగా చూపించారు.పోలీసులు మరియు దొంగల మధ్య పోరు అన్నది చాలా సినిమాల్లో కనిపిస్తుంటుంది. కానీ ఈ సినిమాలో మాత్రం పోలీసులు తమ డిపార్టెంట్‌మెంట్‌కు చెందిన పోలీసులను పట్టుకోవడానికి ప్రయత్నించడం అనే పాయింట్ కొత్తగా ఉంటుంది. రీమేక్ సినిమానే అయినా కూడా ఆ ఫీలింగ్ రాకుండా దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ముఖ్యంగా శ్రీకాకుళం యాస మరియు ఆ నేటివిటీ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలిచాయి.థియేటర్స్ లో ఆకట్టుకున్న ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి..
Pandhem modalayyindhi!
Gelichedi evaro chudandi 🤟🏻#KotabommaliPS Premieres Jan 11 on @ahavideoIN @actorsrikanth #BunnyVass #VidyaKoppineedi @DirTejaMarni @GA2Official @varusarath5 @bhanu_pratapa @Rshivani_1 @ActorRahulVijay @DopJagadeesh @ranjinraj_ @m3dhun @GaddeAjay… pic.twitter.com/uop8IrQYjI— Geetha Arts (@GeethaArts) January 4, 2024