తొలి సినిమా ‘ఉప్పెన’తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పంజా వైష్ణవ్‌తేజ్ నటించిన రెండో సినిమా ‘కొండపొలం’. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను తెరకెక్కించాడు. దసరా కానుకగా అక్టోబర్ 8న విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సినిమాలో వైష్ణవ్‌తేజ్‌కు జోడీగా రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటించింది. ఇంజనీరింగ్ చదివిన ఓ యువకుడు ఉద్యోగం సంపాదించుకోవడానికి భయపడుతూ… కొండపొలంకు వెళ్లినప్పుడు మానసికంగా ఎలాంటి పరిణితి చెందాడనేదే ఈ మూవీ కథ. ఈ సినిమాలో కటారి రవీంద్ర యాదవ్‌గా వైష్ణవ్, ఓబులమ్మగా రకుల్ కనిపిస్తారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చారు.
