Site icon NTV Telugu

Konda Vishweshwar Reddy : ఈ రాష్ట్రంలో అభివృద్ది జరుగుతుంది అంటే మోడీ ప్రభుత్వం వల్లనే

Konda Vishweswar Reddy

Konda Vishweswar Reddy

భారత్ జీడీపీ గ్రోత్ 8.4 శాతం ఇది శుభవార్త అన్నారు బీజేపీ నేత కొండ విశ్వేశ్వర్ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మోడీతో మంచి సంబంధాలు పెట్టుకున్నారన్నారు. ఈ ప్రభుత్వం అసెంబ్లీ లో హుందాగా వ్యవహరించింది… బూత్ లు మాట్లాడలేదన్నారు. ఈ రాష్ట్రంలో అభివృద్ది జరుగుతుంది అంటే మోడీ ప్రభుత్వం వల్లనే అన్నారు. ఈ ప్రభుత్వం 9 వేల కోట్లు అప్పులు తెచ్చుకునేందుకు సహకరించిందన్నారు. తెలంగాణ లో కరెంట్, ఇల్లు ,రోడ్లు, అభివృద్ది అన్ని మోడీ వల్లనే అని ఆయన కొనియాడారు. రాహుల్ గాంధీకి ఓటు వెయ్యాలని కాంగ్రెస్ అడగడం లేదు… అసాధ్యమైన పథకాలు కు ఓటు వేయాలని అడుగుతున్నారు… రాహుల్ బాబా కు ఓటు వేయమని ధైర్యం కాంగ్రెస్ కి లేదని, మేము మోడీ కి ఓటు వేయాలని అడుగుతున్నామన్నారు.

HanuMan : ఓటీటీలోకి వచ్చేస్తున్న హనుమాన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

మా ఎమ్మె్ల్యేలను సీఎం కలిస్తే దుష్ర్పచారం చేశారు.. రేవంత్ మోడీనీ కలిశాడు మేము ఏమి అలా అనలేదన్నారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌, కేటీఆర్ మీద ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు… ఆ కుటుంబాన్ని కాపాడేందుకే మెడిగడ్డ ను మాత్రమే పట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్‌ను కాపాడుతుంది కాంగ్రెస్సేనని ఆయన మండిపడ్డారు. లేకుంటే ఇప్పటికే బీఆర్‌ఎస్‌ లేకుండా పోయేదన్నారు. మాకు బీఆర్‌ఎస్‌తో పొత్తు లేదని, చేవెళ్లలో 2 లక్షల మెజారిటీతో బీజేపీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మీ మాటను మీ హై కమాండ్ వినడం లేదు…. కేసీఆర్‌ కుటుంబాన్ని కాపాడుతుందంటూ ఆయన విమర్శించారు.

Kishan Reddy : ఏప్రిల్‌ మెుదటి వారంలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు

Exit mobile version