Site icon NTV Telugu

KTR: అది మీరు చేయగలరా.. కొండా సురేఖకు కేటీఆర్‌ కౌంటర్‌

Ktr

Ktr

KTR: వరంగల్‌లో గురువారం మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. మంత్రులు డబ్బులు తీసిన తర్వాతే ఫైళ్లపై సంతకాలు పెడతారని ఆమె చెప్పిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా శుక్రవారం స్పందించారు. కొండా సురేఖ మాట్లాడిన కొన్ని నిజాలకు అభినందనలు అని, తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ “కమీషన్ సర్కార్” నడుస్తోందని విమర్శించారు. 30 శాతం కమిషన్ లేకుండా ఫైళ్లపై మంత్రులు సంతకాలు పెట్టరని వారి సహచర మంత్రులే చెబుతున్నారని, సచివాలయం లోపల కాంట్రాక్టర్లు ధర్నాలు చేయడం చూస్తే, ఈ వ్యవస్థలో కమిషన్ వ్యవహారం ఎంత లోతుగా ఉందో స్పష్టమవుతోందన్నారు.

Hari Hara VeeraMallu: పవన్ కళ్యాణ్ ఫాన్స్ రెడీగా ఉండండి.. హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్.!

మంత్రుల పేర్లను బహిర్గతం చేసి ప్రజలకు సత్యం చెప్పాలని కొండా సురేఖని కోరుతున్నానని, రేవంత్ రెడ్డి లేదా రాహుల్ గాంధీ, ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశిస్తారా? అంటూ కేటీఆర్ విమర్శల వర్షం కురిపించారు. దీనిపై కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తప్పుగా ప్రచారం చేస్తోందని, తన మాటల ఉద్దేశం గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులపైనేనని స్పష్టం చేశారు. “పనులకు అప్పటి మంత్రులు డబ్బులు తీసుకునేవారు అన్నదే నా మాట. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలపై ఎలాంటి విమర్శలు చేయలేదు” అంటూ మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారానికి తావు ఇవ్వడం సరైంది కాదని ఆమె పేర్కొన్నారు.

Chidambaram: ఇండియా కూటమిపై చిదంబరం హాట్ కామెంట్స్.. బీజేపీపై ప్రశంసలు

Exit mobile version