KTR: వరంగల్‌లో గురువారం మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. మంత్రులు డబ్బులు తీసిన తర్వాతే ఫైళ్లపై సంతకాలు పెడతారని ఆమె చెప్పిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా శుక్రవారం స్పందించారు. కొండా సురేఖ మాట్లాడిన కొన్ని నిజాలకు అభినందనలు అని, తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ “కమీషన్ సర్కార్” నడుస్తోందని విమర్శించారు. 30 శాతం…
హైదరాబాద్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సూచించారు. వీసా గడువు తీరిన చాలా మంది బంగ్లా, పాక్ దేశస్థులు హైదరాబాద్‌లో ఉన్నారన్నారు. వీరందరిని వెంటనే వెనక్కి పంపి వేయాలని డిమాండ్ చేశారు. వీరి ఏరివేతకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్ ఉన్నారని గతంలో చాలా సందర్భాల్లో రుజువైందని.. స్లీపర్ సెల్స్ కు హైదరాబాద్ ఎంపీ మద్దతు ఉందని ఆరోపించారు.