NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy : తెలంగాణలో పరిస్థితులను సోనియాకు వివరించా

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

ఢిల్లీలో సోనియాగాంధీ, ప్రియాంక గాంధీలతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెడతానని సోనియా చెప్పారన్నారు. భట్టి పాదయాత్ర, ప్రియాంక సభలపై చర్చించినట్లు ఆయన వెల్లడించారు. ప్రతి 10 రోజులకు ఒకసారి తెలంగాణకు రావాలని ప్రియాంకను కోరానని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. మేమంతా కలిసిపోయామని, ఎలాంటి విభేదాలు లేవని మేడంకు చెప్పానన్నారు. తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సోనియాకు చెప్పానని, ఒకరి పాదయాత్రకు మరొరకం సహకరిస్తున్నామని సోనియాకు చెప్పినట్లు ఆయన మీడియాకు వివరించారు.

Also Read : South Central Railway : పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు, తెలంగాణలో పరిస్థితులను సోనియాకు వివరించానని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు. వీలుంటే ఖమ్మం సభకు వస్తామని సోనియా చెప్పారని, కర్నాటక తరహాలో టికెట్లు ముందే ప్రకటించాలని కోరానని ఆయన అన్నారు. జులై 7 తరువాత డేట్‌ ఇస్తామని సోనియా అన్నారని, ఈ మూడు నెలల్లో 33 జిల్లాలు కవర్‌ చేయాలని మేడంను కోరామన్నారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. అయితే..

Also Read : Infosys: “వర్క్ ఫ్రమ్ హోం”కి ఇన్ఫోసిస్ గుడ్ బై.. వారానికి 5 రోజులు ఆఫీస్ నుంచే పని..

కర్ణాటక తరహాలోనే తెలంగాణాలో పోరాడాలని సూచించారని, కలిసికట్టుగా పనిచేయాలని ప్రియాంక గాంధీ సూచించారన్నారు. అందరు కాంగ్రెస్‌లో చేరుతారని, పదవులు ఎవరికి వచ్చినా ఇబ్బందేం లేదన్నారు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిన లక్ష్యం నెరవేరలేదన్నారు. అయితే.. మీ సోదరుడు వస్తారా అని విలేకరులు ప్రశ్నిస్తే అందరూ వస్తారు అని కోమటి రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. నేను స్టార్ క్యాంపెయినర్ అని క్లైమ్ చేసుకున్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. అయితే.. గతంలో నేను కాంగ్రెస్ లో ఎంపీగా మాత్రమే ఉన్నానని, సామాన్య కార్యకర్తను అని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.