Site icon NTV Telugu

Komitireddy Venkat Reddy : కొత్తగూడెం, రామగుండం ఎయిర్‌పోర్టులకు లైన్‌ క్లియర్‌

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

Komitireddy Venkat Reddy : వరంగల్ మామునూర్ ఎయిర్ పోర్టుకు NOC సాధించామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ ప్రజల కళ నెరవేరబోతుందన్నారు. 8 నెలల్లో పూర్తి చేసేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నామన్నారు. 250 ఎకరాల ప్రభుత్వ భూమి ఎయిర్ పోర్టు కోసం ప్రభుత్వం కేటాయించిందని, డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీ వెళ్లి పౌర విమానయాన శాఖ మంత్రిని కలుస్తామన్నారు. వరంగల్ జిల్లాలో మెగా టెక్స్ టైల్ పార్కు వచ్చింది. దేశంలోనే పెద్దదని, భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు కూడా సాధిస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఈ నాలుగు ఎయిర్ పోర్టులు పూర్తి చేస్తామని, విజయవాడ హైవే ఆరు లైన్ల రోడ్డు పనులు జనవరిలో ప్రారంభిస్తామన్నారు. 2018లో ప్రారంభం అయిన ఉప్పల్ స్కైవే పనులు 30 శాతం మాత్రమే పూర్తి అయ్యాయని, రాబోయే ఏడాదిన్నర లోపు ఉప్పల్ స్కై వే నిర్మాణం పూర్తి చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి. రీజినల్ రింగ్ రోడ్డు 2016లో నాటి ప్రభుత్వం ప్రకటించింది. కానీ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని, కేంద్రం, రాష్ట్రం కలిసి పని చేయాలన్నారు. రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణ పనులు పూర్తి చేస్తామని, ఢిల్లీలో ఉన్న మంత్రులు నెలలో 27 రోజులు గల్లీలో ఉంటున్నారన్నారు. కిషన్ రెడ్డి ఎప్పుడు గల్లీలో ఉంటున్నారని, కిషన్ రెడ్డి ఒక్కసారి నల్గొండ జిల్లాలో ఒక గ్రామంలో నిద్ర చేసి రండన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి.

Ram Charan In Kadapa: కడపలో కట్టలు తెంచుకున్న ‘మెగా’ అభిమానం

అంతేకాకుండా..’కిషన్ రెడ్డి అక్కడ నిద్ర చేసి కాళ్ళు, చేతులతో క్షేమంగా వచ్చే అవకాశం ఉంటదా? కాళ్ళకు సాక్సులు, చేతులకు గ్లోజ్ లు వేసుకుని ఇంట్లో పండుకున్నారు కేంద్ర మంత్రులు. కిషన్ రెడ్డి సింగరేణి మీద ఒక్కసారి రివ్యూ చేయలేదు. బండి సంజయ్ మణిపూర్ అల్లర్ల పై రివ్యూ చేశారా. కిషన్ రెడ్డి వేల కోట్ల బడ్జెట్ ఉండే శాఖకు మంత్రి… ఆ శాఖకు రాజీనామా చేసి హైదరాబాద్ లో ఉండాలి. మూసీ సుందరికరణను బీజీపీ, బీఆర్ఎస్ కలిసి అడ్డుకుంటున్నారు. బీఆర్ఎస్లో రేపిస్టులని పెట్టుకున్నట్లు కేటీఆర్ ఒప్పుకున్నారు. అలాంటి వారిని పార్టీలో పెట్టుకున్నందుకు దండం పెట్టాలి. వేల పుస్తకాలు చదివిన కేసీఆర్… నల్గొండ ప్రజలు ఎటు పోయిన పర్వాలేదు అని చెబితే మా సీఎం దగ్గరకు వెళ్లి మూసీ జోలికి వెళ్ళొద్దని చెబుతా.’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు.

Jio 5G: అదిరిపోయే ఆఫర్.. రూ.601తో ఏడాదంతా అన్‌లిమిటెడ్‌ డేటా

Exit mobile version