వరంగల్ మామునూర్ ఎయిర్ పోర్టుకు NOC సాధించామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ ప్రజల కళ నెరవేరబోతుందన్నారు. 8 నెలల్లో పూర్తి చేసేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నామన్నారు. 250 ఎకరాల ప్రభుత్వ భూమి ఎయిర్ పోర్టు కోసం ప్రభుత్వం కేటాయించిందని, డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీ వెళ్లి పౌర విమానయాన శాఖ మంత్రిని కలుస్తామన్నారు.
Sky Walk: హైదరాబాద్ ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోడ్డు దాటడం అంటే సాహసించాల్సిందే. ఇప్పటికే ఎంతో మంది రోడ్డు దాటుతూ తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు.
రద్దీగా ఉండే ఉప్పల్ జంక్షన్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్కైవాక్ మరో మూడు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న మెట్రో రైలు నిర్మాణంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) నిర్మిస్తున్న లూప్ ఆకారపు సదుపాయం రాజధాని నగరంలో మరో ప్రత్యేకమైన ఇంజనీరింగ్ అచీవ్‌మెంట్‌గా నిలుస్తుంది. పనులు శరవేగంగా జరుగుతున్నాయని మే 2022 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని హెచ్‌ఎండీఏ అధికారి తెలిపారు. “నిర్మాణం యొక్క స్తంభాలు వేయబడ్డాయి. డెక్ భాగం యొక్క 60…