NTV Telugu Site icon

Komatireddy Rajagopal Reddy: కేసీఆర్‌ను ఓడించే శక్తి బీజేపీకి ఉందనుకున్నా.. కానీ..

Komatireddy Rajagopal Reddy

Komatireddy Rajagopal Reddy

Komatireddy Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తన పార్టీ మార్పుపై స్పందించారు. ఇప్పటికే లేఖ విడుదల చేశానన్న రాజగోపాల్ రెడ్డి.. 2009 నుంచి 2014 వరకు తెలంగాణ కోసం పని చేశానన్నారు. కాంగ్రెస్‌లో నాయకత్వ ఎంపికలో జరిగిన తప్పుడు నిర్ణయాల వల్లా కాంగ్రెస్ రెండు సార్లు ఓడిపోయిందన్నారు. కేసీఆర్‌కి బుద్ది చెప్పాలని పోరాటం మొదలు పెట్టినట్లు ఆయన వెల్లడించారు. 12 మంది ఎమ్మెల్యేలను లాక్కుని ప్రతిపక్ష గొంతు లేకుండా చేశారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీతోనే కేసీఆర్‌ని కొట్టొచ్చు అని బీజేపీలోకి వెళ్ళానన్న ఆయన.. మునుగోడులో ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ గెలిచిందన్నారు. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని కేవలం 10 వేల మెజార్టీతో బీఆర్‌ఎస్ గెలిచిందన్నారు. నైతికంగా తానే గెలిచినట్లు కోమటిరెడ్డి తెలిపారు. బీజేపీ వ్యవహారంతో తెలంగాణలో డీలా పడిందని.. లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేస్తారు అని అనుకున్నామని.. కానీ కేసీఆర్ అవినీతిపై చర్యలు లేవన్నారు. దీంతో బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అనే భావన వచ్చిందన్నారు. కేసీఆర్ అవినీతిపై చర్యలు ఉంటాయని బీజేపీలో చేరానన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి. కేసీఆర్‌ను గద్దె దించి కుటుంబాన్ని జైల్లో పెడతారు అనుకున్నానని ఆయన వెల్లడించారు. కవిత అరెస్ట్ కాకపోవడం.. కేసీఆర్‌పై చర్యలు లేకపోవడంతో ప్రజల్లో బీజేపీపై అనుమానం వచ్చిందన్నారు.

Also Read: Congress: బీజేపీ-బీఆర్‌ఎస్‌ల లగ్గం పిలుపు.. పెండ్లి కార్డు విడుదల చేసిన కాంగ్రెస్

చాలా ఆలోచన చేశానని.. మోడీ, అమిత్ షాలు తనను గౌరవించారని ఆయన పేర్కొన్నారు. మోడీ అంటే గౌరవమని.. మునుగోడుకు వచ్చి అమిత్ షా ఎన్నికల ప్రచారం చేశారన్నారు. బీజేపీలో ఉండాలి అనుకున్నానని, పార్టీ మారొద్దు అనుకున్నా కానీ తెలంగాణ సమాజం కాంగ్రెస్‌ని ఎంచుకుందని రాజగోపాల్‌ రెడ్డి వెల్లడించారు. కర్ణాటక ఫలితాల తర్వాత.. ప్రజలు కాంగ్రెస్‌కి అధికారం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులు, ప్రజలకు మేలు జరగలేదని విమర్శించారు.ప్రజాస్వామ్యము లేదు.. కేసీఆర్‌పై తీవ్ర అసంతృప్తితో ప్రజలు ఉన్నారని వ్యాఖ్యానించారు. చాలా మంది కాంగ్రెస్‌లోకి రండి అని కోరారని.. బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌తోనే గద్దె దించొచ్చు అని కోరినట్లు ఆయన వెల్లడించారు. బీజేపీ ప్రత్యామ్నాయం అనుకున్నాం కానీ అలా లేదన్నారు. కాంగ్రెస్‌లతో జనం ఉండాలని నిర్ణయించుకున్నారన్నారు. తెలంగాణ సమాజం మేలు కోసమే ఎప్పుడైనా తన నిర్ణయం ఉంటుందన్నారు. నిరుద్యోగులకు, పేదలకు అండగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. కేసీఆర్‌ను గద్దె దించే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు.

Also Read: Tamil Nadu: గవర్నర్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి.. డీఎంకేపై బీజేపీ విమర్శలు..

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. తానంటే గిట్టని వాళ్లు.. కాంట్రాక్టుల కోసం బీజేపీకి అమ్ముడు పోయారని అన్నారని.. అమ్ముడుపోతే తిరిగి కాంగ్రెస్‌లోకి ఎలా వస్తానని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కూడా కాంట్రాక్టు పనులు ఇస్తా అన్నారని.. అయినా పోలేదన్నారు. డబ్బులు..కాంట్రాక్టు కోసం ఎప్పుడూ చూడనని.. ప్రజల కోసమే పని చేస్తానన్నారు. మునుగోడులో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి తన రాజీనామాతోనే సాధ్యమైందన్నారు. ఎప్పుడైనా ఏ త్యాగానికి అయినా సిద్ధమని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో మా ఆవిడ పోటీ చెయ్యదన్న రాజగోపాల్‌ రెడ్డి.. మునుగోడు నుంచి తాను పోటీ చేస్తానని వెల్లడించారు.

బీజేపీలో ఉన్నప్పుడు ఎల్బీ నగర్ నుండి పోటీ చేయండి అన్నారని.. ప్రాణం ఉన్నంత వరకు మునుగోడుతోనే ఉంటానని ఆయన తెలిపారు. మునుగోడు ప్రజల రుణం తీర్చుకుంటానని ఆయన వ్యాఖ్యానించారు. మునుగోడుతో పాటు గజ్వెల్‌లో పోటీ చేస్తానంటూ రాజగోపాల్‌ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ ఆదేశిస్తే గజ్వేల్ నుంచి కూడా పోటీ చేస్తానన్నారు. మునుగోడులో ప్రచారం కాదు కేసీఆర్.. పోటీ చేయ్ అంటూ రాజగోపాల్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. అధిష్టానం అవకాశం ఇస్తే గజ్వేల్‌లో కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని అన్నారు. తనపై అమ్ముడు పోయారు అని నిందలు వేసిన అందరూ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ఆయన ప్రశ్నలు గుప్పించారు. నన్ను కొనే శక్తి ఎవడికి లేదన్నారు. అమ్ముడు పోయాడు అని మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు.

Also Read: YSRCP Samajika Sadhikara Bus Yatra: రేపటి నుంచి వైసీపీ బస్సు యాత్ర.. పోస్టర్‌ ఆవిష్కరణ

రాజగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ.. “కేసీఆర్ తన కొడుకుని సీఎం చేయాలని చూస్తున్నారు. దళితుణ్ణి చేస్తా అని తన కొడుకుని సీఎం చేయాలని చూస్తున్నారు. కేసీఆర్ ముఖంలో రక్తం లేదు. ఓడిపోతాం అని డిసైడ్ అయ్యారు. కేటీఆర్..హరీష్‌లను చూస్తుంటే జాలి పడుతున్నా. అందరి కాళ్ళు మొక్కుతున్నారు అధికార అహంకారంతో 10 ఏండ్లు ఉన్నారు. కేటీఆర్ స్థానంలో దళితుడు..బడుగు బలహీన వర్గాల వ్యక్తి సీఎం అవ్వాలి. తెలంగాణ అవినీతిలో.. అప్పుల్లో నంబర్ వన్. అప్పులు తెచ్చి కాంట్రాక్టర్ల కోసం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుండు కేసీఆర్. ఎన్నికలు వస్తే.. కొత్త పథకాలు తెస్తున్నాడు. ఓడిపోతాం అనే భయం కేసీఆర్ ముఖంలో కనిపిస్తుంది. తెలంగాణ సమాజం మళ్ళీ ఓటు వేయరు. తెలంగాణ సమాజం ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తారు తప్పితే చూస్తూ ఊరుకోరు. తెలంగాణలో రాచరిక పాలన నడుస్తోంది కొందరు బానిసలు.. ప్రగతి భవన్‌లో కీలక పదవిలో ఉన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. తెలంగాణ ద్రోహులు.. కేసీఆర్ వెంట కీలక పదవులు పొందుతున్నారు. 27న చేరుతున్న రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నా. ఎల్బీ నగర్, లేదంటే మునుగోడు లో బీజేపీ టికెట్ ఇస్తా అన్నారు. కానీ మా నాయకులు వద్దన్నారు. కావాలంటే పార్టీలో ఉంటా కానీ..మీకు పనికి రాను.. పోటీ చేయను అన్నా.” అని ఆయన పేర్కొన్నారు.

Also Read: BRS Narsapur Ticket: నర్సాపూర్ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి.. బీఫాం అందజేసిన కేసీఆర్‌

“కాంగ్రెస్‌లో నాయకత్వం రాహుల్, సోనియాది. రేవంత్.. రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెనక్కి వస్తే మెట్టు దిగుతా అన్నారు. పోస్టర్లు ఎవరు వేశారు అనేది అందరికి తెలుసు..రేవంత్ కాదు. గతంలో నిర్ణయం కంటే ఇది పెద్ద నిర్ణయం. ప్రజల కోసం వెనకడుగు వేశా. ఎందరో ఎన్నో మాట్లాడతరు. అన్నింటికీ సమాధానం చెప్పలేం కమ్యూనిస్టులని మోసం చేసింది కేసీఆర్. యుద్ధం చేయడానికే వచ్చా.. పదవి కోసం కాదు. ఎంపీ, ఎమ్మెల్యే పదవులు చేశా.. ఇంకేం కావాలి. పబ్లిక్ అంతా ఏం కోరుతున్నారు. కాంగ్రెస్ పెద్ద సముద్రం.. ఎవరైనా రావచ్చు. నిన్నటి వరకు కూడా బీజేపీలో ఉండాలి అనుకున్నా. కానీ..ఎవరిని అడిగినా కాంగ్రెస్‌లోకి రండి అంటున్నారు. నేను..రేవంత్ పాలోళ్లం కాదు.. పగవాళ్ళం కాదు. నేను ఆయన మీద పోటీ చేయలేదు.. కొడంగల్‌లో ఇద్దరం పోటీ పడలేదు. పని చేసుకుంటూ పోతాం. కాంగ్రెస్‌లో పదవులు మారుతూ ఉంటాయి. రేవంత్ ఇప్పుడు పీసీసీ. రెండేళ్ల తర్వాత ఆయనే ఉంటారా. ఏఐసీసీ అధ్యక్షులే మారుతున్నారు.. చాలా అనుకుంటాం..తిట్టుకుంటాం. ఇవన్నీ చిన్న చిన్న అంశాలు.” అని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పేర్కొన్నారు.