Minister Komatireddy Venkat Reddy: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోరుతూ టీపీసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన మహాధర్నాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గైర్హాజరైన విషయం తెలిసిందే..ఈ అంశంపై చీట్‌చాట్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీ ధర్నాకు ఇండియా కూటమి నేతలు వచ్చారని తెలిపారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే జార్ఖండ్ మాజీ సీఎం శిబుసోరేన్ అంత్యక్రియలకు వెళ్లారని అందుకే గైర్హాజరైనట్టు తెలిపారు. ఇండియా కూటమిలో కీలక నేత చనిపోతే పోకుంటే ఎలా..? అని ప్రశ్నించారు.
READ MORE: MS Swaminathan Jayanti: ప్రజల ఆకలి తీర్చిన విజ్ఞాని.. ఎంఎస్ స్వామినాథన్ జయంతి స్పెషల్
కాంగ్రెస్‌కి పుస్తకాలు రాసే అలవాటు ఉంటే. పదేళ్లలో ఎన్నో పుస్తకాలు రాసే వాళ్ళమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. కేటీఆర్.. 20 నెలలకే పేర్లు రాసి పెడతా అంటున్నారని.. తాము పదేళ్లలో ఎంతో ఇబ్బంది పడ్డామన్నారు. వాళ్ళ లాగ తాము అరెస్టులు.. కేసులు పెట్టడం లేదన్నారు. నో పాలిటిక్స్… తనకు అభివృద్ధి ముఖ్యమన్నారు. నేషనల్ హైవే పనుల మీద ఢిల్లీలో ఉన్నట్లు తెలిపారు. AMRP లైనింగ్ టెండర్లు వచ్చే నెల ఉంటుంది. Slbc పూర్తి చేద్దాం అనుకుని పని మొదలుపెడితే… దిష్టి తగిలినట్టుంది.. కూలిందన్నారు. జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళ పేర్లు నా ముందు తియ్యకండి. జగదీశ్ రెడ్డి లెవెల్‌కి నన్ను దిగజార్చకండని అసహనం వ్యక్తం చేశారు. సినిమా కార్మికుల సమస్యలపై స్పందిస్తూ.. రేపు సమావేశం నిర్వహిస్తు్న్నట్లు వెల్లడించారు. దిల్ రాజు వాళ్ళను రేపు రమ్మని చెప్పానని… . కార్మికుల సమస్యలపై చర్చ చేసి మాట్లాడతానన్నారు.
READ MORE: Instagram: యూజర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్ 3 కొత్త ఫీచర్లు.. ఇకపై మీకు నచ్చిన రీల్స్ ను..