Actor Jiiva: నీకు అసలు బుద్ధుందా?.. రిపోర్టర్‌పై రెచ్చిపోయిన హీరో జీవా!
- స్టోర్ ప్రారంభోత్సవానికి జీవా
- రిపోర్టర్స్ వరుస ప్రశ్నలు
- కోపోద్రిక్తుడైన హీరో జీవా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ్ హీరో జీవా ఓ రిపోర్టర్‌తో వాగ్వాదానికి దిగారు. హేమ కమిటీ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమలో దుమారం రేపుతోంది కదా.. అలాంటి సంఘటనలు తమిళ్ ఇండస్ట్రీలో కూడా ఉన్నాయా? అని రిపోర్టర్ ప్రశ్నించగా జీవా కోపోద్రిక్తుడయ్యారు. ఇలాంటి చోట ఏం ప్రశ్నలు అని అంటూ.. నీకు అసలు బుద్ధుందా? అని ఫైర్ అయ్యారు. ఇందుకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆదివారం తేనిలోని ఓ టెక్స్టైల్ స్టోర్ ప్రారంభోత్సవానికి హీరో జీవా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన జీవా.. అక్కడికి వచ్చిన అభిమానులతో ఫొటోలు దిగారు. ఆ సమయంలో కొందరు రిపోర్టర్స్ ఆయనను ప్రశ్నలు అడిగారు. తమిళ్ ఇండస్ట్రీలో కూడా లైంగిక వేధింపులు ఉన్నాయా? అని అడగ్గా.. ‘చాలా రోజుల తర్వాత తేనీకి వచ్చాను. చాలా పరిశ్రమలలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. మీ పని వార్తలను సేకరించడం. మంచి వాతావరణాన్ని కాపాడుకోవడం మా పని. కేరళలో లాగా తమిళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు, వివాదాలు లేవు. ఈ ప్రశ్నకు నేను ఇప్పటికే సమాధానమిచ్చా. ఓ మంచి కార్యక్రమానికి వచ్చిన నన్ను ఇలాంటి అసభ్యకరమైన ప్రశ్నలు అడగవద్దు’ అని జీవా బదులిచ్చారు.
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
Also Read: Happy Birthday Pawan Kalyan: నీలాంటి నాయకుడే కావాలి.. అద్భుతాలు నువ్వు మాత్రమే చేయగలవు: చిరు
మీరు నటులు కాబట్టే చిత్ర పరిశ్రమలో వస్తున్న ఆరోపణలపై మేం ప్రశ్నలు అడిగాం అని జీవాతో ఓ రిపోర్టర్ అన్నారు. రిపోర్టర్ అలా అనగానే.. జీవా కోపోద్రిక్తుడయ్యారు. ‘నేను పదే పదే సమాధానం చెప్పలేను, నీకు ఏమైనా బుద్ధుందా?’ అని మండిపడ్డారు. అక్కడున్న విలేకరులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడి పరిస్థితులు మారిపోయాయి. వెంటనే కొందరు జీవాను అక్కడినుంచి తీసుకెళ్లారు. ఈ ఘటన అక్కడ కలకలం సృష్టించింది.
உனக்கு அறிவு இருக்கா? செய்தியாளரிடம் எகிறிட்டு வந்த ஜீவா… கேள்வி கேட்டா பதில் சொல்ல மாட்டாராம்… உச்சக்கட்ட தெனாவட்டு நடத்தை!#Jiiva #ActorJiiva #Kollywoodcinema #TamilCineama #HemacommitteeReport #Mollywood #Mohanlal #NewsTamil24x7 pic.twitter.com/QeB5xKmfLY
— News Tamil 24×7 (@NewsTamilTV24x7) September 1, 2024
తాజావార్తలు
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!