Kollu Ravindra : శవం లేస్తే తప్ప జగన్ ఏపీకి రావాట్లేదంటూ కొల్లు రవీంద్ర ఫైర్
- రెడ్ బుక్ పేరు వింటేనే వైసీపీ నేతలు గజగజ వణికిపోతున్నారు
- పాపాలు చేసి పారిపోయిన వైసీపీ నేతలు ఎక్కడ దాక్కున్నా వెతుకొచ్చి దోషులుగా నిలబెట్టేందుకు పోలీసు యంత్రాంగం సిద్దంగా ఉంది. ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాకముందే కౌంటింగ్ కేంద్రం నుంచి వంశీ
- కొడాలినాని పారిపోయారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొడాలి నాని, వల్లభనేని వంశీలను పేర్ని నాని దాచాడంటూ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. శవం లేస్తే తప్ప జగన్ ఏపీకి రావట్లేదంటూ కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. తన భద్రత పెంచాలని జగన్ అంటుంటే.. జగన్ నుంచి తమకు భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, ఏపీలో ఎవరైనా చనిపోయి శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ వస్తున్నాడని ఆయన మండిపడ్డారు. పులివెందుల ఎమ్మెల్యేకి సీఎం తరహా సెక్యురిటి, పీఎం తరహా భద్రత ఉండదనే విషయం జగన్ తెలుసుకోవాలని, రాబందులా ఐదేళ్లు రాష్ట్రాన్ని పీక్కు తిన్న జగన్ అండ్ కో చంద్రబాబు చేసే అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతోందన్నారు కొల్లు రవీంద్ర.
Nandamuri : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు.. నందమూరి ఫ్యాన్స్ కు పండగే..
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
అంతేకాకుండా..’రెడ్ బుక్ పేరు వింటేనే వైసీపీ నేతలు గజగజ వణికిపోతున్నారు. పాపాలు చేసి పారిపోయిన వైసీపీ నేతలు ఎక్కడ దాక్కున్నా వెతుకొచ్చి దోషులుగా నిలబెట్టేందుకు పోలీసు యంత్రాంగం సిద్దంగా ఉంది. ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాకముందే కౌంటింగ్ కేంద్రం నుంచి వంశీ, కొడాలినాని పారిపోయారు. కొడాలి నాని, వంశీలను పేర్ని నానినే దాచాడనే అనుమానాలు ఉన్నాయి. జగన్ పిచ్చికి తగ్గట్టు మా బందరు పిచ్చోడు పేర్ని నాని తయారయ్యాడు. సుపరిపాలన కోసం సీఎం వాట్సాప్ గ్రూప్ లు పెట్టమనడాన్ని పేర్ని నానీ వక్రీకరిస్తున్నారు. పేర్ని నాని హైదరాబాద్ లో అక్రమ ఆస్తులు కొనటానికి వెళ్తే ప్రజలు తరిమారు. ఇలానే పేర్నినాని పిచ్చి ప్రేలాపనలు పేలితే ఏపీ ప్రజలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.’ అని కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
-
OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
-
CM Revanth Reddy : దేశంలో పోరు ఆ రెండు పరివార్‌ల మధ్యే.!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!