Live-in relationship: బ్రేకప్ చెప్పిందని.. ప్రియురాలి పెంపుడు కుక్కల హత్య.. వీడియో కాల్ చేసి దారుణం!
- ప్రియురాలు బ్రేకప్ చెప్పిందిన ఉన్మాదిగా మారిన ప్రియుడు..
- పెంపుడు కుక్కల్ని దారుణంగా చంపి, యువతికి వీడియో కాల్..
- కోల్‌కతాలో దారుణ సంఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Live-in relationship: ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని ఒక వ్యక్తి దారుణంగా ప్రవర్తించిన ఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగింది. లివ్-ఇన్-రిలేషన్షిప్ తెంచుకుందనే కోపంతో ఓ వ్యక్తి, యువతి పెంపుడు కుక్కల్ని దారుణంగా చంపేశాడు. ఆ కుక్కల్ని చంపుతున్న సమయంలో తన మాజీ ప్రియురాలికి వీడియో కాల్ చేసి ఆ దృశ్యాలను చూపించాడు. దక్షిణ కోల్‌కతాలోని బ్రిక్రమ్గఢ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంజీబ్ భట్టాచార్య అనే వ్యక్తి పరిణోవా అనే మహిళ కొంత కాలం లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు. అయితే, ఇటీవల పరిణోవా సంజీబ్తో తన బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకుని, ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో శనివారం సంజీబ్ పరిణోవాకు వీడియో కాల్ చేశాడు. ఆమె పెంపుడు కుక్కని ఉరితీసి చంపేశాడు. ఈ దృశ్యాలతో ఆందోళన చెందిన పరిణోవా, స్థానికంగా తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి, ఫ్లాట్‌కు వెళ్లి చూడాలని కోరింది. అతను అక్కడికి వెళ్లేలోపే రెండు కుక్కలు చనిపోయి కనిపించాయి. ఫ్లాట్ మొత్తం రక్తంతో నిండిపోయి ఉంది.
Also Read
- Thailand Phuket Fire Accident: థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది మృతి, 17 మందికి గాయాలు!
- Vizag Crime: ఇన్‌స్టా పరిచయంతో ఇంట్లోకి ఎంట్రీ.. బంగారం, వజ్రాల నగలతో పరారీ..!
- Eagle Force: నిషేధిత ఈ-సిగరెట్ల అక్రమ దందా గుట్టురట్టు.. సప్లై నెట్వర్క్ ఛేదించిన ఈగల్ ఫోర్స్!
- కేపీహెచ్‌బీ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. సమత డైరీలో ఏముంది?
ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదైంది. సంజీబ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై బెంగాల్ జంతు హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నటి, యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ దెబ్లినా దత్తా ఘటనా స్థలానికి వెళ్లారు. ఈ విషయాన్ని మంత్రి అగ్నిమిత్రపాల్ దృష్టికి తీసుకెళ్లి, సంజీబ్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీ ఎమ్మెల్యే పాపియా అధికారి కూడా ఈ ఘటనపై స్పందించారు. నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని, అతడిని సమాజంలో స్వేచ్ఛగా తిరుగనివ్వొద్దని వ్యాఖ్యానించారు.
తనను తీవ్ర శారీరక వేధింపులకు గురిచేయడంతో, ప్రాణభయంతో ఫ్లాట్‌ను వదిలివెళ్లాల్సి వచ్చిందని పరిణోవా చెప్పింది. ఆమె స్వస్థలం హిమాచల్ ప్రదేశ్. గత ఆరేడు నెలలుగా ప్రతీరోజూ నన్ను సంజీబ్ కొట్టేవాడని, ఇంటి నుంచి వెళ్లిపోవడం తప్పా తనకు వేరే మార్గం లేదని, అన్ని విధాలుగా తనను వేధించాడని, చివరకు నన్ను చంపేసేవాడే అని ఆమె మీడియాతో చెప్పింది. తన సోదరుడిని కూడా కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేశాడని, కొన్ని నెలల క్రితం సంజీబ్ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడనని, ఈ ఘటన తర్వాత తన సోదరుడిపై కేసు నమోదైందని ఆమె తెలిపారు.
తాజావార్తలు
-
Imran Khan: ‘‘ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చు’’.. నిస్సహాయ స్థితిలో ఇమ్రాన్ ఖాన్ లేఖ!
-
Love Story: అనిరుధ్ మామ కళానిధి మారన్ ప్రేమ కథ తెలుసా?
-
INDIA Bloc: ఎన్నికల సంఘానికి 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టులో INDIA కూటమి పిటిషన్!
-
Mouli: టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు దొంగ నా కొడుకు .. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ బ్యానర్లో మూడో సినిమా?
-
AP Elections: ముగిసిన 23 పట్టణ స్థానిక సంస్థల నామినేషన్ల పర్వం.. రేపు పరిశీలన..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!