కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. కాగా.. గణేశోత్సవాన్ని లైట్లు, అలంకరణలకు దూరంగా ఉంచాలని రాజధాని గణేష్ పూజ కమిటీలు నిర్ణయించాయి. ‘అత్యాచారానికి వ్యతిరేకంగా పోరాటం’ అనే థీమ్‌తో తమ పూజాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈసారి సాల్ట్‌లేక్‌లోని బీ బ్లాక్‌లో జరిగే 15 ఏళ్ల గణేష్ పూజ కోసం చందర్‌నగర్ నుంచి కొనుగోలు చేసిన లైట్లను రద్దు చేయాలని నిర్ణయించారు. చందర్‌నగర్ లైట్లు వాటి ప్రత్యేకమైన డిజైన్‌కు ప్రసిద్ధి చెందాయి. కానీ ఈసారి వాటిని పూజలో ఉపయోగించరు.
READ MORE: UPS: యుపీఎస్ పథకాన్ని ఆమోదించిన మొదటి రాష్ట్రం.. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పండగే!
పూజా కమిటీ ప్రెసిడెంట్ అనింద్యా ఛటర్జీ మాట్లాడుతూ.. పండల్‌కు వెళ్లే దారిలో కనీస లైటింగ్ ఉంటుందని, పండల్ లోపల ఎరుపు రంగు లైట్లు ఉంటాయన్నారు. పీఎన్బీ ద్వీపం సమీపంలోని పండల్ పూర్తిగా ‘దర్శన్ రుఖ్ దిన్’ (అత్యాచారానికి వ్యతిరేకంగా) అనే సందేశంతో కటౌట్‌లతో కప్పబడి ఉంటుందని స్పష్టం చేశారు. చిన్న చిన్న అక్షరాలతో నినాదాలు కూడా రాస్తామని తెలిపారు. మనం ఈ ముప్పును ఇప్పుడే ముగించకపోతే.. మన సహచరులు కూడా దీని బారిన పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని కోరారు. బాధిరాలి కుటుంబానికి తాము ఉన్నామంటూ భరోసా కల్పించారు. ఇంతే కాకుండా ఈ ఘటనపై పూజారులు కూడా నిరసనలు వ్యక్తం చేస్తారని తెలిపారు.
READ MORE: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 వాహనాలు ధ్వంసం, ఐదుగురు మృతి
బాగ్ బజార్ సర్బోజనిన్ గణేష్ పూజ కమిటీ ప్రతినిధి మాట్లాడుతూ.. పండల్‌లో మరో రెండు లైట్లు ఏర్పాటు చేయాలన్న ఆర్డర్‌లను రద్దు చేసినట్లు తెలిపారు. 12 ఏళ్లుగా ఈ పూజలు నిర్వహిస్తున్నామని, స్థానిక ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పూజను రద్దు చేయలేమని చెప్పారు. కాగా.. మహిళా వైద్యురాలి హత్యకు నిరసనగా కొందరు పూజలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
READ MORE: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 వాహనాలు ధ్వంసం, ఐదుగురు మృతి
కాగా.. మరోవైపు ఈ ఘటన లో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కి పాలీగ్రాఫ్ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని అధికారులు ఆదివారం నిర్ధారించారు. రాయ్ ప్రస్తుతం కోల్‌కతా జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా ఉన్నాడు. అక్కడే లై డిటెక్టర్ పరీక్ష చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే కేసుకు సంబంధించి మరో ఇద్దరు నిందితులకు సీబీఐ కార్యాలయంలో పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. అయితే, నిందితులు ఏం చెప్పారన్న వివరాలను మాత్రం గోప్యంగా ఉంచారు. ఈ కేసులో ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్‌ఘోష్, బాధితురాలిపై హత్యాచార ఘటన చోటుచేసుకున్న రోజు డ్యూటీలో ఉన్న మరో నలుగురు వైద్యులు, మరో సివిల్ వాలంటీర్‌కు శనివారం లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించారు. ఆ వివరాలు కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
