Site icon NTV Telugu

Kodali Nani: తెలంగాణలో జనసేన, బీజేపీ పొత్తు, ఎన్నికల ఫలితాలపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..

Kodali Nani

Kodali Nani

Kodali Nani: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్న సంగతి విధితమే.. ఇదే సమయంలో.. ఆశించిన ఫలితాలు మాత్రం రాబట్టలేకపోయారు.. అయితే, తెలంగాణలో జనసేన, బీజేపీ పొత్తు, ఎన్నికల ఫలితాలపై కొడాలి నాని హాట్‌ కామెంట్స్‌ చేశారు.. జనసేన, బీజేపీ పోటీ చేస్తే జనసేన పరిస్థితి ఏంటో తెలంగాణలో చూశామన్న ఆయన.. ఏపీలో టీడీపీ, జనసేన పోటీ చేస్తే మళ్లీ జనసేన పరిస్థితి అదే అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారం కోసం కాదు ప్రతిపక్షం కోసం చంద్రబాబు జనసేనను కలుపు కున్నాడని.. ఎమ్మెల్యే అవ్వాలంటే టీడీపీతో కలవాలని పవన్ అనుకుంటున్నాడు.. ఎమ్మెల్యే కోసం పవన్, ప్రతిపక్షం కోసం చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు.. వీరు ఇద్దరూ కలిసి జగన్ వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read Also: Meftal: పెయిన్‌కిల్లర్ “మెఫ్టాల్”పై కేంద్రం కీలక హెచ్చరికలు..

వైఎస్‌ జగన్ సింహం మాదిరి సింగిల్ గా వస్తారు అని స్పష్టం చేశారు కొడాలి నాని.. ఇక, చంద్రబాబు పెద్ద 420.. ఆయన అధికారంలోకి రావడం కల అని స్పష్టం చేశారు.. సీఎం వైఎస్‌ జగన్ మీద వ్యతిరేకత లేదు.. జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చారని తెలిపారు. లారీ కింద దూరిన కుక్కకి టీడీపీ వారికి తేడా లేదని.. రేవంత్ రెడ్డి తెలంగాణలో గెలిస్తే ఇక్కడ టీడీపీ వాళ్లు సంబరాలు చేస్తున్నారు.. గెలిస్తే తమ వారని, ఓడితే తమకు సంబంధం లేదని చెప్పటం టీడీపీ నేతలకు అలవాటు అంటూ దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో సెటిలర్స్ తో ఓట్లు వేయించి కేసీఆర్‌ను ఓడిస్తమని చెప్పారు.. కానీ, హైదరాబాద్‌లో ఒక్క సీటు కాంగ్రెస్ గెలిచిందా..? అని ప్రశ్నించారు. గ్రేటర్‌లో బీఆర్ఎస్‌ భారీ మెజార్టీతో గెలిచిందని గుర్తుచేశారు.

Read Also: Ambati Rambabu: రైతులు ధైర్యంగా ఉండండి.. నష్టపోయిన ప్రతి రైతుకు ఇన్‌ఫుట్‌ సబ్సిడీ..

టీడీపీ వాళ్లు సిగ్గు లేకుండా గాంధీ భవన్‌కు టీడీపీ జెండాలతో వెళ్లి వెధవలు గంతులేశారని ఫైర్‌ అయ్యారు కొడాలి నాని.. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ పార్టీ పెట్టారు.. అలాంటి పార్టీ జెండాలను తీసుకుని చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ వెధవలు గాంధీ భవన్ వెళ్లారని మండిపడ్డారు. ఇక, కేసీఆర్‌ కూడా చంద్రబాబు శిష్యుడే.. ఒక శిష్యుడు దిగిపోతే ఇంకో శిష్యుడు అధికార పీఠం ఎక్కాడు.. ఇందులో టీడీపీ వాళ్లు ఏం చేశారని హడావిడి ఎందుకు? అని ప్రశ్నించారు. నా శిష్యులు ముఖ్యమంత్రులు అవుతున్నారు.. నేను ఇలా అయ్యాను ఎంటి అని చంద్రబాబు ఏడుస్తున్నారు అంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు మాదిరి పరిపాలన చేస్తే ఒకసారి మాత్రమే అధికారంలోకి వస్తారు.. కేసీఆర్‌ కూడా రెండు సార్లు పరిపాలన చేశారు అని గుర్తు పెట్టుకోవాలన్నారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని.

Exit mobile version