Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
- పంచాయతీ ఎన్నికల సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు
- ఎన్నికల సంఘం నివేదికతో కేసు నమోదు
- మంత్రిగా ఉండటంతో విచారణకు అనుమతి అవసరం
- హోంశాఖ నుంచి అధికారిక అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి నానిపై నమోదైన కేసులో ప్రాసిక్యూషన్కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పంచాయతీ ఎన్నికల సమయంలో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యల వ్యవహారంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఇది ఎన్నికల నిబంధనల అమలులో భాగమని అధికార వర్గాలు చెబుతుండగా.. మరోవైపు రాజకీయ కక్షసాధింపులో భాగమనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
2021లో రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుంది. కొడాలి నాని వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించాయని భావించిన రాష్ట్ర ఎన్నికల సంఘం సంయుక్త కార్యదర్శి.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా ఎస్పీకి నివేదిక పంపించారు. ఆ నివేదిక ఆధారంగా పోలీసులు 2021లోనే స్థానిక న్యాయస్థానం అనుమతి తీసుకుని కేసు నమోదు చేశారు.
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
కేసు నమోదైన సమయంలో కొడాలి నాని రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. చట్ట ప్రకారం ప్రజాప్రతినిధులు లేదా మంత్రులపై విధుల నిర్వహణకు సంబంధించిన అంశాల్లో విచారణ లేదా ప్రాసిక్యూషన్ చేపట్టాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఈ కారణంగా కేసు తదుపరి దశకు వెళ్లకుండా నిలిచిపోయింది. తాజాగా కృష్ణా జిల్లా కలెక్టర్ పంపిన నివేదికను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం.. కొడాలి నానిపై ప్రాసిక్యూషన్ కొనసాగించేందుకు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అధికారికంగా ఆమోదం తెలిపారు. దీంతో కొడాలి నానిపై నమోదైన కేసులో న్యాయపరమైన ప్రక్రియలు మరింత వేగంగా ముందుకు సాగే అవకాశం ఏర్పడింది.
- Tags
- ap
- ap govt
- kodali nani
- Prosecution
- ycp
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!