Site icon NTV Telugu

Kodali Nani: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్

Kodali Nani

Kodali Nani

Kodali Nani: తాడేపల్లిగూడెం జెండా సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్‌ సీఎం జగన్‌ను తొక్కడం కాదు.. పవన్ కల్యాణ్‌ను నాశనం చేస్తున్న చంద్రబాబును 80 లక్షల పాదాలు తిరిగి లేవకుండా పాతాళానికి తొక్కుతాయన్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బలా కాపు సామాజిక వర్గం చంద్రబాబుకి బుద్ధి చెబుతుందన్నారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ జెండా సభలు పెట్టుకుంటున్నారని కొడాలి నాని విమర్శించారు. ప్రజలను, పార్టీని,తనను నమ్ముకోని చంద్రబాబు.. పవన్ కల్యాణ్‌ను నమ్ముకొని, ఆయన ఓటు బ్యాంకుతో గెలవాలన్న స్థాయికి దిగజారాడన్నారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ.. సీఎం జగన్‌ను పవన్ కల్యాణ్ దారుణాతి దారుణంగా తిడుతున్నారని చెప్పారు.

Read Also: Ambati Rambabu: పవన్‌ రాజకీయాలకు పనికొచ్చే మనిషి కాదు.. అంబటి సంచలన వ్యాఖ్యలు

ప్రతిగా మేము మాట్లాడితే పవన్ సామాజిక వర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు కుటిల రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. చేసిన మంచిని చెబుతూ ప్రజలను నమ్మిన సీఎం జగన్.. 175 స్థానాల్లో అభ్యర్థులను నిలుపుతున్నారని కొడాలి నాని తెలిపారు.14 ఏళ్ల అధికారం వెలగబెట్టిన చంద్రబాబు.. ఐదేళ్లు మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ మా పాలనను చూసి ఓటెయ్యండని అడగలేని దుస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.

Read Also: CM YS Jagan Tour: బనగానపల్లెలో మార్చి 4న సీఎం జగన్ పర్యటన

చంద్రబాబు తన సామాజిక వర్గానికి 21 సీట్లు ప్రకటించారు.. మరో 10 స్థానాలు ఇవ్వనున్నారు.. మూడు శాతం ఓటింగ్ ఉన్న వర్గానికి 31 సీట్లు ఇస్తే.. తమకు 20శాతం ఓటింగ్ ఉందని చెబుతున్న జనసేన పార్టీ శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎన్ని సీట్లు ఇవ్వాలని ప్రశ్నించారు. 24 సీట్లతో తాము సంతృప్తిగా లేమని జనసైనికులు బహిరంగంగా చెబుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. తనపై సింపతీ క్రియేట్ చేసుకొని తన సామాజిక వర్గ ఓట్ల ద్వారా చంద్రబాబును సీఎం చేయడానికే… పవన్ కళ్యాణ్ యుద్ధం మొదలుపెట్టినట్లు ఫీల్ అవుతున్నారన్నారు. చంద్రబాబు – పవన్ కల్యాణ్ చేతిలో మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేరన్నారు.

 

Exit mobile version