NTV Telugu Site icon

Kodali Nani: చంద్రబాబు గుడివాడ పర్యటనపై ఘాటుగా స్పందించిన కొడాలి నాని

Kodali Nani

Kodali Nani

Kodali Nani: టీడీపీ అధినేత చంద్రబాబు గుడివాడ పర్యటనపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు, గుడివాడ వచ్చి కొత్తగా ఏం చెప్తాడని ఆయన అన్నారు. చంద్రబాబు గుడివాడ వచ్చినా.. బెజవాడ వచ్చినా.. ఎక్కడ తిరిగిన శ్రమ, ఆయాసం తప్ప ప్రయోజనం ఉండదని ఎద్దేవా చేశారు. నాడు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన ప్రజలను చంద్రబాబు గాలికి వదిలేసాడని ఆరోపించారు. కోటరీ ఆస్తుల పెంపకానికి చంద్రబాబు పాటుపడ్డాడని ఆరోపణలు చేశారు. చంద్రబాబు నైజమెంటో ప్రజలందరికీ తెలుసని విమర్శించారు.

Read Also: Tarakaratna Wife : తారకరత్నను మర్చిపోలేకపోతున్న అలేఖ్యరెడ్డి.. ఎమోషనల్ పోస్ట్

వైసీపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారన్న బాలకృష్ణ కామెంట్‌కు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. బాలయ్య వీర తిలకం దిద్ది పంపిన అల్లుళ్ళను ఇంటికి పంపించినట్లే.. బావ, బావమరిదిలైన బాలయ్య,చంద్రబాబులను వచ్చే ఎన్నికల్లో జగన్ ఇంటికి పంపుతారన్నారు. వై నాట్ అంటున్న బాలయ్యకు… ఎన్నికల్లో జగన్ అంటే ఏంటో చూపిస్తారన్నారు. ప్రజల్లో విశ్వాసం, కార్యకర్తల్లో నమ్మకం లేని వారికి జగన్ సీట్లువ్వరని కొడాలి నాని పేర్కొన్నారు. విశ్వాసం లేని ఎమ్మెల్యేల కోసం ప్రభుత్వాన్ని, ప్రజల్ని పణంగా పెట్టనని జగన్ చెప్తున్నారన్నారు. ప్రజల్లో మమేకమవుతూ, వారి అభిమానాన్ని పొందిన వారికి జగన్ తప్పకుండా సీట్లు ఇస్తారని ఈ సందర్భాంగా వ్యాఖ్యానించారు. మేము సీట్లు ఇవ్వని ఎమ్మెల్యేలు చంద్రబాబుతో టచ్‌లో ఉంటే మాకేమవుతుందని ఆయన అన్నారు. ఎన్నికల ఏడాదిలో ప్రజలు టచ్‌లో ఉండాలి… ప్రజాదరణ కోల్పోయిన ఎమ్మెల్యేలు కాదని కొడాలి నాని వివరించారు.