ఐపీఎల్ 16వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. అయితే.. నేడు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే.. బ్యాటింగ్ కు దిగిన కోల్ కతాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రహమానుల్ల డకౌట్ కాగా..వెంకటేశ్ అయ్యార్ 7 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ జేసన్ రాయ్ 9 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం 2 ఓవర్లు ముగిసే సరికి కోల్ కతా రెండు వికెట్ల నష్టానికి 16 పరుగులు చేసింది. స్టేడియానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఇప్పటి వరకు 8 మ్యాచ్ లు ఆడి 3 మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో 6 పాయింట్లతో తొమ్మితో స్థానంలో ఉంది సన్ రైజర్స్. ఈ మ్యాచ్ హైదరాబాద్ కు చాలా కీలకం. అలాగే 9 మ్యాచ్ లు ఆడి 3 మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది కోల్ కతా. ప్లే ఆఫ్ రేసు జట్టు నిలవాలంటే ఈ మ్యాచ్ గెలవడం ఇరు జట్లకు ఎంతో కీలకం.
సన్‌రైజర్స్ హైదరాబాద్ : మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్ (సి), హెన్రిచ్ క్లాసెన్ (w), హ్యారీ బ్రూక్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగి, టి నటరాజన్
కోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మానుల్లా గుర్బాజ్(w), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(c), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి