Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో గిన్నెలు తోముతున్నప్పుడు నీళ్లు మెల్లగా పోతున్నాయా? లేదా డ్రెయిన్ నుంచి దుర్వాసన వస్తోందా? ఇలా జరగగానే చాలామంది వెంటనే బజార్లో దొరికే ఘాటైన కెమికల్ డ్రెయిన్ క్లీనర్లను తీసుకొచ్చి పోసేస్తుంటారు. మరికొందరు బేకింగ్ సోడా, వెనిగర్ వేసి ట్రై చేస్తే, ఇంకొందరు వెంటనే ప్లంబర్‌కు ఫోన్ చేస్తుంటారు. కానీ, అన్ని రకాల బ్లాకేజీలకు ఒకే పద్ధతి పనిచేయదని మీకు తెలుసా? పైగా పదే పదే సరైన అవగాహన లేకుండా కెమికల్స్ వాడితే మీ ఇంటి డ్రైనేజీ పైపులు శాశ్వతంగా పాడైపోయే ప్రమాదం ఉంది. సాధారణంగా వంటగది సింక్‌లో కేవలం ఆహార పదార్థాల ముక్కలే కాకుండా నూనె, నెయ్యి జిడ్డు, సబ్బు అవశేషాలు, నీటిలోని మినరల్స్ రోజూ కొద్దికొద్దిగా పేరుకుపోతుంటాయి. ప్రారంభంలో నీటి ప్రవాహం కొద్దిగా నెమ్మదిస్తుంది, కానీ సమయానికి శ్రద్ధ తీసుకోకపోతే నాళాలు పూర్తిగా పూడుకుపోతాయి. అందుకే ఏ సమస్యకు ఏ పరిష్కారం వాడాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
ఇంటి చిట్కాలైన బేకింగ్ సోడా, వెనిగర్లు కేవలం తేలికపాటి చిన్న చిన్న జిడ్డును వదులుచేయడానికే ఉపయోగపడతాయి. లోపల గట్టిగా పేరుకుపోయిన మురికిని ఇవి అంత సులభంగా వదిలించలేవు. ఇక కెమికల్ క్లీనర్ల విషయానికొస్తే, ఇవి కొన్ని రకాల అడ్డంకులను తొలగించినప్పటికీ, వీటి వల్ల చర్మానికి, కళ్లకు హాని కలగడమే కాకుండా పైపులు కూడా దెబ్బతింటాయి. వీటిని వాడే ముందు తప్పకుండా చేతులకు తొడుగులు తొడుక్కోవాలి. ముఖ్యంగా విభిన్న రకాల కెమికల్స్ లేదా బ్లీచ్, యాసిడ్ వంటివాటిని ఎప్పుడూ కలిపి వాడకూడదు, వీటి మిశ్రమం వల్ల ప్రాణాంతకమైన విషవాయువులు వెలువడతాయి. ఇక మార్కెట్లో దొరికే ఎంజైమ్ క్లీనర్లు ఆహార వ్యర్థాలను క్రమంగా కరిగిస్తాయి కానీ, ఇవి వెంటనే పనిచేయవు, పూర్తిగా పూడుకుపోయిన పైపులను క్లీన్ చేయలేవు.
Also Read
- Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
సింక్ జామ్ అయినప్పుడు కంగారు పడకుండా మొదట సింక్ జాలీలో పడిన చెత్తను చేత్తో తీసివేయాలి. అడ్డంకి చిన్నదైతే ప్లంగర్ ఉపయోగించి వదులు చేయవచ్చు, లేదా డ్రెయిన్ స్నేక్ సహాయంతో లోపలి మురికిని బయటకు లాగవచ్చు. ఒకవేళ మీరు ఇప్పటికే సింక్‌లో ఏదైనా కెమికల్ వేసి ఉంటే, దానిపై మరో క్లీనర్ పోయడం కానీ లేదా వెంటనే పైపును ఊడదీయడం కానీ చేయకూడదు. భవిష్యత్తులో ఈ తిప్పలు తప్పాలంటే కొన్ని చిన్న అలవాట్లను చేసుకోవడం మంచిది. నూనె, నెయ్యి, మిగిలిపోయిన వంటకాల జిడ్డును నేరుగా సింక్‌లో పోయకూడదు. సింక్ రంధ్రంపై ఎప్పుడూ జాలీ ఉంచాలి, గిన్నెలు కడిగిన ప్రతిసారీ ఆ జాలీలోని చెత్తను క్లీన్ చేయాలి. నీళ్లు కాస్త నెమ్మదిగా వెళ్తున్నట్లు అనిపిస్తే వెంటనే ఆలస్యం చేయకుండా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో సింక్ పదే పదే పూడుకుపోతున్నా, డ్రెయిన్ నుంచి మురికి నీరు మళ్లీ పైకి వస్తున్నా, లేదా ఇంటికి సంబంధించిన మిగతా డ్రెయిన్లలో కూడా ఒకేసారి నీరు నెమ్మదిగా పోతున్నా అది పైపులలో లోతైన పెద్ద సమస్య కావచ్చు. అటువంటప్పుడు సొంత ప్రయోగాలు చేయకుండా వెంటనే అనుభవజ్ఞుడైన ప్లంబర్ని పిలిపించి చెక్ చేయించడమే సురక్షితమైన మార్గం.
తాజావార్తలు
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!