కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డిని హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో తెలంగాణ పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా బాటసింగారం గ్రామంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించేందుకు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాలకు కేంద్ర మంత్రి లేఖ రాసి ఫిర్యాదు చేశారు. పర్యటన గురించి ముందస్తు సమాచారం ఇచ్చినా తెలంగాణ పోలీసులు తమను అరెస్ట్ చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించకుండా తెలంగాణ ప్రభుత్వం తనను అడ్డుకుంటుందని ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్రపతికి రాసిన లేఖలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి పండుగ లాంటి వార్త
లోక్‌సభ స్పీకర్‌కు రాసిన లేఖ లోప్రధాన మంత్రి అవాస్ యోజన పథకం కింద తెలంగాణకు 2.5 లక్షల ఇళ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ఒక కేంద్ర మంత్రిగా, ఎంపీగా ఈ పథకాన్ని తాను పర్యవేక్షించాల్సి ఉందని చెప్పారు. అందులో భాగంగా తాను పరిశీలనకు వెళ్తుండగా పోలీసులు అడ్డగించి అరెస్టు చేశారని లేఖలో వెల్లడించారు. ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నానని, కేంద్ర మంత్రిగా, ఎంపీగా తాను చేయాల్సిన విధులకు తెలంగాణ ప్రభుత్వం ఆటంకం కలిగించినందుకు గానూ ఈ విషయం మీకు తెలియజేస్తున్నానని లేఖలో రాశారు.
Rakesh Varre: బాహుబలి నటుడు.. మొన్న హీరో.. నేడు నిర్మాత.. మాములుగా లేదుగా
మరోవైపు ఛలో బాటసింగారం పిలుపు నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన కిషన్ రెడ్డిని ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు బీజేపీ నేతలు ఛలో బాటసింగారం కార్యక్రమానికి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అయితే అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందని అప్రమత్తమైన పోలీసులు బీజేపీ లీడర్లను ఎక్కడికక్కడ అడ్డగించారు. అటు శంషాబాద్‌లో కిషన్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలీసులు తీరుకు నిరసనగా ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారిలో ధర్నాకు దిగారు. జోరు వానలోనే రోడ్డుపై బైఠాయించారు. చివరకు కిషన్ రెడ్డిని ఒప్పించి ధర్నా చేస్తున్న ప్రదేశం నుంచి తీసుకెళ్లారు.