NTV Telugu Site icon

Kishan Reddy: తెలంగాణ ప్రజలు మోడీ నాయకత్వం కోరుకుంటున్నారు..

Kishan Reddy

Kishan Reddy

మెదక్ జిల్లా తూప్రాన్లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ మొదటి వారంలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం విజయ సంకల్ప యాత్రలతో రాష్ట్రమంతా ప్రయాణిస్తున్నామని పేర్కొన్నారు. దేశానికి మోడీ ఎంతో సేవ చేశారు.. టాయిలెట్ నుండి చంద్రయాన్ వరకు నరేంద్ర మోడీ చేయని అభివృద్ది కార్యక్రమం లేదని కిషన్ రెడ్డి తెలిపారు. పేదలకు ఉచితంగా ఇళ్లు, గ్యాస్, బియ్యం అందించారని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పేదలకు రూ.5లక్షల ఆరోగ్య భీమా అందించారు.. జాతీయ రహదారుల నిర్మాణం, గ్రామ పంచాయితీలలో అభివృద్దికి కేంద్రం నిధులు ఇస్తుందని అన్నారు. ఏడాదికి రైతులకు మోడీ రూ. 6 వేల ఇస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.

PM Modi: మంగళగిరి ఎయిమ్స్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ

హైదరాబాద్ తో సహా దేశంలో అనేక చోట్ల ఉగ్రవాద దాడులు జరిగేవి.. దేశాన్ని మోడీ శాంతియుత దేశంగా మార్చారని తెలిపారు. పాక్ ఉగ్రవాదుల ఆటకట్టించారు.. పదేళ్లుగా దేశం శాంతియుతంగా ఉంది.. దేశంలో అందరూ సంతోషంగా ఉంటున్నారు.. దానికి కారణం మోడీనేనని కిషన్ రెడ్డి తెలిపారు. దేశం మొత్తం మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో 17 సీట్లను గెలిచే ప్రయత్నం చేస్తు్న్నాం.. తెలంగాణ ప్రజలు మోడీ నాయకత్వం కోరుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసింది.. ఆ పార్టీ తెలంగాణకు అవసరం లేదని ఆరోపించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. అవినీతికి పెట్టింది పేరు కాంగ్రెస్.. ఆ పార్టీ నేతలు అవీనితి పరులని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కు ఉన్న 40 సీట్లు కూడా ఇప్పుడు కాంగ్రెస్ కు రావని విమర్శించారు.

TS Inter Hall Tickets: తెలంగాణ ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండిలా..!

దేశం గాడీలో ఉండాలంటే, మన పిల్లల భవిష్యత్ బాగుండాలంటే మోడీ నాయకత్వాన్ని ఆశీద్వారించాలని కిషన్ రెడ్డి కోరారు. రాజకీయాలకు అతితంగా ఆలోచన చేయండి.. మెదక్ పార్లమెంట్ లో బీజేపీ గెలవాలని కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో అనేక సమస్యలను మోడీ పరిష్కారించారు.. అవీనితి లేని పాలన అందిస్తు్న్నారని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా యూరియా ధరలు పెరిగాయి.. కానీ పెరిగిన ధరలను కేంద్రమే సబ్సీడిగా భరిస్తుందని చెప్పారు. తెలంగాణలో రూ.2లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు గ్యారంటీ లేదు, 6 గ్యారంటీలకు దిక్కు లేదు.. వాళ్ళు ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తారని మండిపడ్డారు. మాట తప్పిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు వదిలిపెట్టారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో 4 ఎంపీ సీట్లు బీజేపీ గెలువబోతుంది.. ఇక కర్ణాటకలో గ్యారంటీల పేరుతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని.. ఇప్పుడు కర్ణాటక బీజేపీ వైపు ఉంది 25 ఎంపీ సీట్లను బీజేపీ గెలువబోతుందని అన్నారు. తెలంగాణలో అదే పరిస్థితి అని చెప్పారు. దేశంలో అభివృద్ది చెందాలంటే మోడీ మళ్లీ రావాలి.. ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ నుండి బీజేపీని గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు.