Kishan Reddy : అంబేద్కర్ స్పూర్తితో మోడీ పాలన సాగిస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంబేడ్కర్ స్పూర్తితో మోడీ పాలన సాగిస్తున్నారని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. మరోసారి అధికారంలోకి వచ్చాక గ్రామ గ్రామానికి రాజ్యాంగాన్ని తీసుకెళ్తాం.. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు కిషన్ రెడ్డి. అంబేడ్కర్ పంచ తీర్థ స్థలాలను అభివృద్ధి చేశామని, పార్లమెంట్ లో తొలిసారి అంబేడ్కర్ ఫోటో పెట్టింది అటల్ జీ.. బీజేపీ అని ఆయన అన్నారు. ఇక్కడ కూడా అంబేడ్కర్ ఫోటో పెట్టాలని ధర్నాలు చేసి.. లాఠీలతో కొట్టించారని, సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ అనే నినాదంతో పని చేస్తున్నామన్నారు కిషన్ రెడ్డి. దేశంలో గిరిజన ప్రాంతాల్లో ఇంకా కరెంట్ లేని పరిస్థితి ఉందని, స్వాత్యంత్రం వచ్చాక కూడా చీకట్లో ఉండే వారిని గుర్తించి.. వారికి మేలు చేస్తున్నామని ఆయన తెలిపారు. దళిత సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం మోడీ ప్రభుత్వం పని చేస్తుందని, ఎస్సీ వర్గీకరణ కు కాంగ్రెస్ పార్టీనే ముందుందని కిషన్ రెడ్డి అన్నారు.
అంతేకాకుండా..నాటి సీఎం రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే లను ప్రధాని దగ్గరికి తీసుకెళ్లాడు.. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం..బీజేపీ తీర్మానం చేసిన కానీ చేయలేదని కాంగ్రెస్, BRS బురదజల్లే ఆరోపణలు చేస్తుంది.. నేను వ్యక్తిగత ఎజెండాతో పని చేయను అని కిషన్ రెడ్డి అన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ బూత్ పరిధిలోనే కార్యకర్తలు 12 గంటలపాటు పనిచేయాలని మీతో పాటు నేను పని చేస్తానని తెలిపారు. ఈ నెల 10న ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతిరోజు 10 నుంచి 30 కుటుంబాలను ప్రతి బూత్ లో కార్యకర్తలు కలిసి వారికి మోదీ ప్రభుత్వ విజయాలు వివరించాలన్నారు. 13న పోలింగ్ జరిగే రోజు ప్రతి కార్యకర్త తన నివాసం సమీపంలోని 10 కుటుంబాలతో ఓటు వేయించే దిశగా ప్రయత్నం చేయాలన్నారు. ఓటర్లు పోలింగ్ బూత్ లకు వెళ్లి ఓటు వేసేలా సిద్దం చేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
Also Read
- Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
- CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు.. సీఎం విజయ్ వైఖరిపై మిత్రపక్షాల్లో ఆగ్రహం..
- Israel-Hezbollah: హిజ్బుల్లా అండర్గ్రౌండ్ను గుర్తించిన ఐడీఎఫ్.. వీడియో విడుదల
- India message to China: పాకిస్తాన్కు చైనా మద్దతు.. భారత్ గట్టి సందేశం..
తాజావార్తలు
-
Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
-
K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
-
Iran Nuclear Warning: అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. ‘మాపై చేయి వేస్తే.. అణు విలయమే!’
-
CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు.. సీఎం విజయ్ వైఖరిపై మిత్రపక్షాల్లో ఆగ్రహం..
-
AP Weather: ఏపీలో విభిన్న వాతావరణం.. ఒకవైపు వడగాల్పులు.. మరోవైపు వర్ష సూచన.!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!